Potato Lollipop : బంగాళాదుంప లాలీపప్.. ఇలా ఈజీగా చేసుకోండి..

పిల్లల కోసం మనం ఎప్పటికప్పుడు వెరైటీ వంటకాలు, స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. సాయంత్రం అయితే చాలు ఈరోజు తినడానికి స్నాక్స్ ఏం చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము. మీ పిల్లలు బంగాళాదుంపను ఇష్టంగా తినేవారైతే వారి కోసం బంగాళాదుంప లాలీపప్ తయారుచేయవచ్చు.................

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 05:00 PM

Potato Lollipop : బంగాళాదుంప లాలీపప్.. ఇలా ఈజీగా చేసుకోండి..

Potato Lollipop :  పిల్లల కోసం మనం ఎప్పటికప్పుడు వెరైటీ వంటకాలు, స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. సాయంత్రం అయితే చాలు ఈరోజు తినడానికి స్నాక్స్ ఏం చేయాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాము. మీ పిల్లలు బంగాళాదుంపను ఇష్టంగా తినేవారైతే వారి కోసం బంగాళాదుంప లాలీపప్ తయారుచేయవచ్చు. ఇంకా మన ఇంటికి ఎవరైనా అతిధులు వచ్చినట్లైతే వారికి కూడా ఇది చేసిపెడితే చాలా బాగుంటుంది. వర్షాలు పాడినప్పుడు మిర్చి బజ్జిలే కాదు ఈ బంగాళా దుంప లాలీపప్ కూడా చేసుకోవచ్చు.

బంగాళాదుంప లాలీపప్ తయారీకి కావలసిన పదార్థాలు:-
* ఉడకబెట్టిన బంగాళాదుంపలు
* బ్రెడ్ పొడి ఒక కప్పు
* సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి
* కొత్తిమీర కొద్దిగా
* సన్నగా తరిగిన పచ్చిమిర్చి
* ఉప్పు తగినంత
* అర స్పూన్ కారం
* అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా
* అర స్పూన్ ధనియాల పొడి
* అర స్పూన్ జీలకర్ర పొడి
* చాట్ మసాలా పొడి
* నిమ్మరసం కొద్దిగా
* పసుపు కొద్దిగా

లాలీపప్ షేప్ చేసుకోవడానికి:

* మైదా రెండు స్పూన్లు
* నీరు మూడు స్పూన్లు
* బ్రెడ్ పొడి పావు కప్పు
* ఉప్పు కొద్దిగా
* టూత్ పిక్స్

ముందుగా ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా స్మాష్ చేసుకొని దానిలో బ్రెడ్ పొడి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, పసుపు అన్నింటిని వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. మెత్తగా కలిపినా దీనిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి.

Lady Finger : బెండకాయ తినడం వలన కలిగే లాభాలు తెలుసా..?

ఇంకొక గిన్నెలో మైదాలో నీళ్లు, కొద్దిగా ఉప్పు కలిపి జారు పిండిలా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక ప్లేటులో బ్రెడ్ పొడి ని ఉంచుకోవాలి. రౌండ్ బాల్స్ ను మొదట మైదా పిండిలో ముంచి ఆ తరువాత బ్రెడ్ పొడిలో ముంచాలి. ఆ బాల్స్ కి మొత్తం పొడి అంటేలా చూడాలి ఈ విధంగా అన్ని బాల్స్ కి చేయాలి. ఆ తరువాత పొయ్యి మీద నూనెను ఉంచాలి. నూనె కాగిన తరువాత మనం రెడీ చేసిన బాల్స్ ను వేయించుకోవాలి. వేయించుకున్న బాల్స్ కు టూత్ పిక్స్ పెట్టి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి బంగాళాదుంప లాలిపప్స్ రెడీ.. వీటికి టమాటో సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. విడిగా తిన్నా బాగుంటాయి.