Sweet Corn Chat : స్వీట్ కార్న్ చాట్ సింపుల్ గా తయారు చేసేయండి..

స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఇవి చాలా తియ్యగా ఉంటాయి. స్వీట్ కార్న్ ఉడకించుకొని తినవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ తో చాట్, సలాడ్, సమోసా ఇంకా చాలా రకాలుగా చేసుకొని తినవచ్చు. స్వీట్ కార్న్ తో చాట్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక పది నిముషాల్లో.........

Kaburulu

Kaburulu Desk

January 3, 2023 | 03:00 PM

Sweet Corn Chat : స్వీట్ కార్న్ చాట్ సింపుల్ గా తయారు చేసేయండి..

Sweet Corn Chat :  పిల్లల కోసం ఎప్పటికప్పుడు వెరైటీ వంటకాలు, స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. సాయంత్రం అయితే చాలు ఈ రోజు తినడానికి స్నాక్స్ ఏం చేయాలి, పిల్లలకి ఏం పెట్టాలి అని ఆలోచిస్తాం. తొందరగా అయిపోయే ఓ స్నాక్ ఐటెం స్వీట్ కార్న్ చాట్. టైం తక్కువ, ఆరోగ్యం కూడాను ఈ స్నాక్ తో. స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారు ఉండరు, ఇవి చాలా తియ్యగా ఉంటాయి. స్వీట్ కార్న్ ఉడకించుకొని తినవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ తో చాట్, సలాడ్, సమోసా ఇంకా చాలా రకాలుగా చేసుకొని తినవచ్చు. స్వీట్ కార్న్ తో చాట్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఒక పది నిముషాల్లో అది తయారు అవుతుంది. పిల్లలు, పెద్దలు ఎవ్వరైనా దీనిని తినొచ్చు.

స్వీట్ కార్న్ చాట్ తయారీకి కావలసిన పదార్థాలు:-

* ఉడికించిన స్వీట్ కార్న్ రెండు కప్పులు
* ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినది
* కొత్తిమీర కొద్దిగా
* చాట్ మసాలా పొడి అర స్పూన్
* టమాటాలు రెండు
* జీలకర్ర పొడి అర స్పూన్
* ఉప్పు తగినంత
* కారం కొద్దిగా
* నిమ్మరసం కొద్దిగా
* పచ్చిమిర్చి ఒకటి

Potato Lollipop : బంగాళాదుంప లాలీపప్.. ఇలా ఈజీగా చేసుకోండి..

ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో మొదట ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను వేసుకొని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు, కారం, చాట్ మసాలా పొడి, జీలకర్ర పొడి బాగా కలుపుకోవాలి తరువాత దాని పైన నిమ్మరసాన్ని, కొత్తిమీర ను చల్లుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ చాట్ తయారైనట్లే. ఇది పుల్లపుల్లగా, కారంగా, నోటికి ఎంతో రుచిగా కూడా ఉంటుంది.