Munagaku : మునగాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

September 27, 2022 | 08:23 AM

Munagaku : మునగాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా??

Munagaku : ములక్కాడలు తింటామని అందరికి తెలుసు. ములక్కాడల వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మునగాకుతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకుతో కూడా వంటలు చేస్తారని కొంతమందికే తెలుసు. మునగాకు తినడమే కాదు, విడిగా కూడా మునగాకు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

*మునగాకులని ఉప్పుతో కలిపి చేసిన మిశ్రమాన్ని వస్త్రంలో చుట్టి ఒంటిమీద తగిలిన దెబ్బలకి పెడితే త్వరగా తగ్గుముఖం పడుతుంది.
*మునగాకుల్ని పసుపుతో కలిపి వేడి చేసి ఆ మిశ్రమాన్ని ఓ వస్త్రంలో చుట్టి నరాలు, ఎముకలు దెబ్బలు, వాపులు ఉన్నచోట కడితే నొప్పులు, వాపులు త్వరగా తగ్గుతాయి.
*మునగాకుని పప్పులో కలిపి తింటే కంటి చూపు మెరుగవుతుంది.
*జీర్ణాశయానికి మునగాకు మంచిగా ఉపయోగపడుతుంది.
*మునగాకు రసానికి కొద్దిగా నిమ్మకాయ చేర్చి ముఖానికి రాస్తే ముఖంపై మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అవుతుంది.
*1 స్పూన్ మునగాకు రసానికి 3 స్పూన్ల మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని నుదుటికి మర్దన చేస్తే తలనొప్పి తగ్గుతుంది.

Bitter Gourd : కాకరకాయ చేదుని ఎలా తగ్గించొచ్చో తెలుసా??