Avoid House Flies : ఈగలను ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

November 23, 2022 | 11:42 AM

Avoid House Flies : ఈగలను ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Avoid House Flies :  మన ఇళ్లల్లో ఈగలు చాలా త్వరగా వస్తు ఉంటాయి. ఆహార పదార్థాలు మూత పెట్టి లేకపోయినా, చుట్టూ పరిసరాలు బాగోకపోయినా ఈగలు వచ్చేస్తాయి. కొంతమంది ఇళ్లల్లో ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈగల వలన కలరా, టైఫాయిడ్, విరేచనాలు, క్షయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఈగలు రాకుండా ఉండాలంటే..

*ఇంటి చుట్టూ నీరు నిలువ ఉన్నా కూడా ఈగలు, దోమలు పెరిగి ఎక్కువగా మన ఇంటిలోనికి వస్తుంటాయి. కాబట్టి మన ఇంటి చుట్టూ నీరు నిలువ లేకుండా చూసుకోవాలి.
*పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఈగలు ఎక్కువగా ఉంటాయి దానికి కారణం పిల్లలు తిన్న పదార్థాలను ఇంటి నిండా పడేస్తుంటారు. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు నీట్ గా ఉంచుకోవాలి.
*మిరియాలను దంచి నీటిలో కలిపి దాన్ని ఇంటి చుట్టూ స్ప్రే చేయడం ద్వారా కూడా ఈగలని తగ్గించవచ్చు.
*తులసి, బంతి పువ్వు, లావెండర్ మొక్కలని ఇంటివద్ద పెంచడం ద్వారా కూడా ఈగలని రాకుండా చేయొచ్చు . ఈ మొక్కలు వెదజల్లే సువాసనలకు ఈగలు మన ఇంటిలోనికి దరిచేరవు.
*వీనస్ ప్లైట్రాప్ అనే మొక్కలను కూడా పెంచవచ్చు. ఇవి ఈగలను తినేస్తాయి.
*అలాగే ఇంటి చుట్టూ వ్యర్థాలు చేరకుండా చూసుకోవాలి. దీనివల్ల ఈగలు ఇంటిలోకి రాకుండా ఉంటాయి.