Night Food : రాత్రిపూట అన్నం తిన్న తరువాత, తినే ముందు ఈ పనులు చేయండి.. రిజల్ట్ మీరే చూడండి..

Kaburulu

Kaburulu Desk

November 26, 2022 | 02:02 PM

Night Food : రాత్రిపూట అన్నం తిన్న తరువాత, తినే ముందు ఈ పనులు చేయండి.. రిజల్ట్ మీరే చూడండి..

Night Food :  రాత్రి పూట అన్నం తిన్న తరువాత, తినే ముందు కొన్ని పనులు చేస్తే మన ఆరోగ్యానికి చాలా మంచిది.
*రాత్రి పూట స్నానం చేయాలనుకుంటే అన్నం తినే ముందు స్నానం చేయాలి. తిన్న తరువాత చేస్తే సరిగా జీర్ణం కాదు.
*రాత్రి పూట అన్నం తిన్న తరువాత కాసేపు నడవాలి ఇలా చేయడం వలన అన్నం త్వరగా జీర్ణం అవుతుంది.
*అన్నం తిన్న తరువాత సిగిరెట్ తాగకూడదు.
*అన్నం తిన్న తరువాత పడుకునే ముందు బ్రష్ చేసుకోవాలి. ఇలా చేస్తే దంతాలతో ఏమైనా పదార్థాలు ఇరుక్కుంటే బయటకు పోతాయి. దంతాలు పాడయ్యే ప్రమాదం తగ్గుతుంది.
*అన్నం తిన్న తరువాత ఒక గ్లాస్ వేడి నీరు లేదా పాలు త్రాగితే హాయిగా నిద్ర పడుతుంది.
*రాత్రి పూట పడుకునే ముందు లూజ్ బట్టలు వేసుకుంటే మంచిది. దీని వలన అన్నం తిన్న తరువాత పొట్ట టైట్ గా అనిపించకుండా మనకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది.
* అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు, పడుకుంటే అన్నం సరిగా జీర్ణం కాకుండా కడుపులో గ్యాస్, ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది.