Suriya 42 : అలా చేస్తే కఠిన లీగల్ చర్యలు తప్పవు.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సూర్య సినిమా నిర్మాతలు..

Suriya 42 : ఇటీవల చాలా సినిమాలకి లీకుల బెడద ఎక్కువవుతుంది. సినిమా యూనిట్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఫోటోనో లేక వీడియోనో షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అవుతుంది. దీంతో ఏం చేయాలో తెలియక చిత్ర యూనిట్స్ తల పట్టుకుంటున్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాకి ఇదే పరిస్థితి ఏర్పడింది.
సూర్య హీరోగా, దిశా పటాని హీరోయిన్ గా కమర్షియల్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ కలిపి సూర్య 42వ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇటీవల ఈ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయి వైరల్ గా మారాయి. దీంతో నిర్మాతలు దీనిపై సీరియస్ గా స్పందిస్తూ ఓ ప్రెస్ నోట్ ని విడుదల చేశారు.
ఈ నోట్ లో.. ”అందరికి ఒక విన్నపం. మా రాబోయే సినిమా సూర్య 42 షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ చేశారు. మేము మా రక్తాన్ని, చెమటని ధారపోస్తూ సినిమా కోసం కష్టపడుతున్నాం. ప్రేక్షకులకి ఒక మంచి థియేట్రికల్ సినిమాని అందించడానికి కష్టపడుతున్నాం. దయచేసి మీరు పబ్లిష్ చేసిన ఫోటోలని డిలీట్ చేస్తే అందరికి మంచిది. భవిష్యత్తులో కూడా ఎవరైనా మా సినిమాకి సంబంధించి ఫోటోలు, వీడియోలు లీక్ చేస్తే వారిపై లీగల్ గా కఠిన చర్యలు తీసుకుంటాము” అని ప్రకటించారు.
Please Don't Share Any Shooting Spot Videos and Photos about #Suriya42 pic.twitter.com/idnGu4VXvz
— Studio Green (@StudioGreen2) September 25, 2022