Throat Infection : చలికాలంలో గొంతు నొప్పి వస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Kaburulu

Kaburulu Desk

November 24, 2022 | 01:18 PM

Throat Infection : చలికాలంలో గొంతు నొప్పి వస్తుందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

Throat Infection :  చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఏది వచ్చిన మనకు గొంతు నొప్పి కూడా వస్తుంది. గొంతు నొప్పిని అశ్రద్ధ చేయకూడదు. గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల ఇంటి చిట్కాలను వాడొచ్చు.

*ఒక స్పూన్ తేనెలో కొద్దిగా అల్లం రసం కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి ఇలా చేస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
*రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి గొంతులో పుక్కిలించి ఊయాలి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి తగ్గడమే కాక ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది.
*రోజూ గోరువెచ్చని నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.
*పుదీనా ఆకులు లేదా తులసి ఆకులు వేసి నీటిని బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నపుడు తాగాలి. ఇలా తాగితే గొంతులో నొప్పి మరియు గరగర తగ్గుతుంది.
*గోరువెచ్చని పాలల్లో పసుపు పొడి లేదా మిరియాల పొడిని కలిపి తాగితే కూడా ఉపశమనం లభిస్తుంది.
*అల్లం టీ తాగితే కూడా గొంతు రిలీఫ్ గా ఉంటుంది.
*వాము ఆకులు లేదా తులసి ఆకులు తిన్నా గొంతులో బ్యాక్టీరియా నశించి గొంతు నొప్పి తగ్గుతుంది.
*గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని త్రాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.