Bitter Gourd : కాకరకాయ చేదుని ఎలా తగ్గించొచ్చో తెలుసా??

Kaburulu

Kaburulu Desk

September 26, 2022 | 08:46 AM

Bitter Gourd : కాకరకాయ చేదుని ఎలా తగ్గించొచ్చో తెలుసా??

Bitter Gourd :  చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు తినడానికి ఇష్టపడరు. కానీ కాకరకాయలో ఆరోగ్యానికి పనికొచ్చే పోషకాలు చాలానే ఉన్నాయి. కాకరకాయలో విటమిన్ ఏ ,బి1, బి 2, బి 3, పొటాషియం, కాల్షియమ్, జింక్, ఐరన్ వంటి మినరల్స్, యాంటియోక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కాకరకాయ చేదుగా ఉంది అనకుండా కాకరకాయతో వంటలు చేసేటప్పుడు కొన్ని పద్దతులతో, కాకరకాయకి కొన్ని పదార్థాలు జతచేయడంతో చేదు తగ్గించొచ్చు.

కాకరకాయ వంటల్లో చేదు తగ్గించటానికి కొన్ని పద్ధతులు :

*కాకరకాయని మజ్జిగతో ఉడకపెడితే చేదు పోతుంది.
*కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
*కాకరకాయ చెక్కు తీసినా చేదు తగ్గుతుంది.
*కాకరకాయ గింజలు తొలిగించినా కొంచెం చేదు తగ్గుతుంది.
*కాకరకాయ పులుసులో బెల్లం వేస్తే చేదు తగ్గుతుంది.
*కాకరకాయ కూరలో పుట్నాలు, మసాలా దినుసుల పొడి వేయడం వల్ల చేదు తగ్గుతుంది.
*కాకరకాయ కూరలో చింతపండు రసం కలిపినా చేదు తగ్గుతుంది.

ఈ విధంగా కాకరకాయ వంటల్లో చేదు తగ్గించి తినొచ్చు. దీంతో కాకరకాయతో వచ్చే పోషకాలని మిస్ అవ్వము.