Leafy Vegetables : ఆకుకూరలు తినడం వలన చాలా ప్రయోజనాలు.. చలికాలం అయితే ఇంకా ఎక్కువ..

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 06:40 PM

Leafy Vegetables : ఆకుకూరలు తినడం వలన చాలా ప్రయోజనాలు.. చలికాలం అయితే ఇంకా ఎక్కువ..

Leafy Vegetables :  చలికాలంలోనే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ కాలంలో దొరికే ఆకుకూరల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తోటకూర, పాలకూర, మెంతి, ఆవ ఆకుకూరలు తినడం వలన ఎన్నో రకాల పోషకాలను పొందవచ్చు. ఇంకా చాలా రకాల వ్యాధుల నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

తోటకూరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియమ్, పొటాషియం లివర్ కు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడుతాయి. తోటకూర తినడం వలన ఇది మన శరీరానికి పెయిన్ కిల్లర్ గా పని చేస్తుంది. అలాగే కంటిచూపుకి చాలా బాగా పనిచేస్తుంది తోటకూర. పాలకూర లో ఉండే విటమిన్ ఎ, విటమిన్ K, ఇంకా ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, ఫైబర్ ఎముకల్ని దృడంగా చేస్తాయి. పాలకూర తరచూ తింటూ ఉండడం వలన కాన్సర్ రావడాన్ని నిరోధిస్తుంది.

Stress Ball : స్ట్రెస్ బాల్ వాడండి.. ఎంత రిలాక్స్ గా ఉంటుందో తెలుసా??

ఆవ ఆకుల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ మనకు జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఆవ ఆకులు తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది. మెంతి కూర గుండె జబ్బులను దూరం చేస్తుంది. మెంతి కూర తినడం వలన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. మెంతికూర తినడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. పాలకూర, మెంతి కూర రెండూ కూడా షుగర్ ని కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి ఈ కాలంలో దొరికే ఆకుపచ్చని ఆకుకూరలను తినడం వలన రోగ నిరోధకశక్తిని పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.