Biryani Leaf Tea : బిర్యానీ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు తెలుసా.. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..

Kaburulu

Kaburulu Desk

December 12, 2022 | 06:48 PM

Biryani Leaf Tea : బిర్యానీ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు తెలుసా.. చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..

Biryani Leaf Tea :  బిర్యానీ ఆకులు పలావు దినుసులతో పాటు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. వాటిని బిర్యానీలోకి మాత్రమే ఎక్కువగా వాడతాము. కొంతమంది మషాలా కూరల్లో కూడా వాడతారు. కానీ వాటితో టీ తయారుచేసుకోవచ్చు. ఆ ఆకుల్లోని మినరల్స్ అన్నీ కూడా టీ ద్వారా మన శరీరానికి అందుతాయి.

పొయ్యి మీద గిన్నెలో రెండు లేదా మూడు కప్పుల నీటికి నాలుగు లేదా ఐదు బిర్యానీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని నీటిలో కలిపి బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడబోస్తే వచ్చే డికాషన్ లో పాలని కలుపుకొని టీ తాగొచ్చు. లేదా ఆ డికాషన్ నే తాగొచ్చు. దీనిని తాగడం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

* ఈ బిర్యానీ ఆకుల టీ మన శరీరంలోని కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
* ఈ టీ రోజూ తాగడం వలన గుండె పోటు, స్ట్రోక్ రావడాన్ని తగ్గిస్తుంది.
* ఈ టీ ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది.
* బిర్యానీ ఆకులలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ మన శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించడానికి సహాయపడతాయి.
* బిర్యానీ ఆకుల టీ తాగడం వలన మూత్రపిండాల్లో రాళ్ళ సమస్యను తగ్గిస్తాయి.
* జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఈ టీ తాగితే ఎంతో ఉపశమనం లభిస్తుంది.
* గొంతు నొప్పి ఉన్నా ఈ టీ తాగితే ఫలితం ఉంటుంది.
* బిర్యానీ టీ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది.