Leafy Vegetables : వండేముందు ఆకుకూరలను శుభ్రం చేస్తున్నారా.. లేకపోతే..
ఆకుకూరలలో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. ఆకుకూరలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని తినేటప్పుడు మనం వాటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే.................

Leafy Vegetables : ఆకుకూరలలో అన్ని రకాల విటమిన్లు ఉంటాయి. ఆకుకూరలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటిని తినేటప్పుడు మనం వాటిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల పైన పురుగుల మందులు పేరుకుపోతాయి. ఇంకా సాలె పురుగులు, కొన్ని రకాల కీటకాలు పేరుకుపోయి మనకు అనేక రకాల వ్యాధులు కలిగేలా చేస్తాయి. కాబట్టి ఆకుకూరలు వండే ముందు శుభ్రంగా కడుగుకొని వండుకోవాలి. లేకపోతే మన ఆరోగ్యానికి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.
ఆకుకూరలను నీళ్ళల్లో వేసి కడిగేటప్పుడు చేతితో రాసి కడుగుకోవాలి. అప్పుడే ఆకుకూరలపై ఏమైనా కీటకాలు ఉంటే పోతాయి. ఆకుకూరలను వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఉంచి ఆ తరువాత కడగాలి. ఇలా కడగడం వలన ఆకుకూరలపై ఉండే కీటకాలు పోతాయి. ఒక కుండ నీటిలో బేకింగ్ సోడా వేసి దానిలో ఆకుకూరలను ముంచి తీయాలి. ఇలా చేసినా ఆకుకూరలలో ఉన్న కీటకాలు పోతాయి. ఆకుకూరలను నీళ్ళల్లో ఉప్పు వేసి దానిలో కాసేపు ఉంచి తరువాత కడిగితే ఇంకా మంచిది.
Sugar Cane Juice : ఈ సమస్యలు ఉన్నవారు చెరుకు రసం తాగకూడదు..
ఆకుకూరలలో మట్టి బాగా ఉన్నట్లైతే ముందుగా నీళ్ళల్లో వేసి కడుగుకోవాలి. రెండు లేదా మూడు సార్లు నీళ్ళల్లో ఆకుకూరలను వేసి కడుగుకోవాలి అప్పుడే మట్టి ఉంటే పోతుంది. ఆకుకూరలను తీసుకునేటప్పుడే వాటికి తెగులు ఏదయినా ఉంటే తీసెయ్యాలి. ఆకుకూరలను ఎంతో జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యానికి మంచిది. లేకపోతే వాటికి ఉండే మట్టి, కీటకాలు, దుమ్ము వంటివి మన ఆహారంలో భాగమయి రోగాలను తీసుకొస్తాయి.