RRR : HCA అవార్డ్స్‌లో 5 అవార్డులను అందుకున్న RRR..
టాలీవుడ్ జక్కన రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం.. ఇంటర్నేషనల్ స్టేజి పై మరికొన్ని అవార్డులను అందుకుంది. ప్రఖ్యాతి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లో..

RRR : టాలీవుడ్ జక్కన రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం.. ఇంటర్నేషనల్ స్టేజి పై మరికొన్ని అవార్డులను అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ భారీ మల్టీస్టార్రర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలుసు. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. అంతేకాదు ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో నాటు నాటు సాంగ్ అవార్డు అందుకొని హిస్టరీ క్రియేట్ చేసింది. కాగా ఈ మూవీ అవార్డుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.
RRR : ఆస్కార్ స్టేజ్‌పై కీరవాణి సంగీత ప్రదర్శన?
ప్రఖ్యాతి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ పలు కేటగిరీలో నామినేషన్స్ లో నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం నిన్న (ఫిబ్రవరి 24) అమెరికాలోని బెవర్లీ హిల్స్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కి రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి హాజరయ్యారు. ఇక ఈ అవార్డ్స్ లో RRR మూవీ.. బెస్ట్ స్టంట్స్, బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్ ఫిలిం, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీల్లో అవార్డులు అందుకుంది. హాలీవుడ్ మూవీస్ తో పాటు పోటీలో నిలిచి 5 అవార్డులు అందుకోవడంతో అందరూ ఆర్ఆర్ఆర్ టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు.
కాగా ఈ ఇంటర్నేషనల్ అవార్డు ఫంక్షన్ కి రామ్ చరణ్ అవార్డు అందుకోవడానికి వెళ్ళలేదు. అవార్డులు ఇవ్వడానికి వెళ్ళాడు. HAC అవార్డ్స్ కి రామ్ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డు సృష్టించాడు. ఇక మార్చి 13న ఆస్కార్ అవార్డుల పురస్కారం కూడా జరగనుంది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పాట ఆస్కార్ అందుకోవడం పక్కా అంటున్నారు హాలీవుడ్ క్రిటిక్స్. మరి ఆస్కార్ అందుకొని RRR చరిత్ర సృష్టిస్తుందా? లేదా? చూడాలి.
Yay!! Thank you @HCAcritics 🙌🏻🙌🏻 #RRRMovie https://t.co/6GE5eFI7yQ
— RRR Movie (@RRRMovie) February 25, 2023
🕺🕺 #NaatuNaatu #RRRMovie 🥇 https://t.co/PDUaqF9wsY
— RRR Movie (@RRRMovie) February 25, 2023
🤩🤩🤩🤩🤩 BEST ACTION FILM GOES TO…… #RRRMovie #HCAFilmAwards https://t.co/R21HIyDIer
— RRR Movie (@RRRMovie) February 25, 2023
BEST INTERNATIONAL FILM GOES TO…. #RRRMovie ❤️🔥#HCAFilmAwards https://t.co/QeTd3SorGo
— RRR Movie (@RRRMovie) February 25, 2023