Rajinikanth : రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. పనివాళ్లపై అనుమానం అని పోలీసులకు కంప్లైంట్ చేసిన ఐశ్వర్య
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తనకు సంబంధించిన నగలు, బంగారపు వస్తువులు, వజ్రాలు, చెవి కమ్మలు, గాజులు, కొంత నగదు రజినీకాంత్ ఇంట్లోని లాకర్ లో భధ్రపరిచింది. ఆ లాకర్ కి సంబంధించిన కీ మాత్రం......................

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తనకు సంబంధించిన నగలు, బంగారపు వస్తువులు, వజ్రాలు, చెవి కమ్మలు, గాజులు, కొంత నగదు రజినీకాంత్ ఇంట్లోని లాకర్ లో భధ్రపరిచింది. ఆ లాకర్ కి సంబంధించిన కీ మాత్రం తన వద్దే ఉంది. తాజాగా బంగారపు నగల కోసం తెరిచి చూడగా అందులో ఉండాల్సిన వస్తువులేవి లేకపోవడంతో దొంగతనం జరిగిందని గుర్తించారు.
అయితే అందులో ఆ వస్తువులు ఉన్నట్టు, దాని తాళం తన దగ్గర ఉన్నట్టు కేవలం తన ఇంట్లో పనిచేసే ఓ నలుగురికి మాత్రమే తెలుసని, ఆ నలుగురి మీద అనుమానం ఉందని పోలీసులకు కంప్లైంట్ చేసింది ఐశ్వర్య రజినీకాంత్. మొత్తం పోయిన సొమ్ము దాదాపు 3 లక్షల 60 వేలకు పైగా ఉంటుందని సమాచారం. తను ఫంక్షన్స్ కి వేసుకెళ్లే నగలు కూడా అందులో ఉన్నాయని, అవి కూడా మిస్ అయ్యాయని తెలిపింది ఐశ్వర్య.
Niharika-Chaitanya : మెగా జంట నిహారిక, చైతన్య విడిపోతున్నారా? వైరల్ అవుతున్న న్యూస్..
దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. మరి ఆ దొంగతనం ఇంట్లో పనివాళ్లే చేశారా? లేదా ఇంకెవరైనా చేశారా అని పోలీసులు విచారణ చేపట్టారు. రజినీకాంత్ ఇంట్లో దొంగలు పడి ఇంత సొమ్ము పోయిందని తెలియడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.