Niharika-Chaitanya : మెగా జంట నిహారిక, చైతన్య విడిపోతున్నారా? వైరల్ అవుతున్న న్యూస్..

లబ్రిటీలలో పెళ్ళిళ్ళు చేసుకోవడం,కొన్నాళ్ళకు విడిపోవడం మాములు విషయమే. సినిమా సెలబ్రిటీలతో అయితే ఈ తంతు మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా మెగా జంట నిహారిక - చైతన్య విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఓ సారి ఇదే వార్తలు రాగా నిహారిక..............

Kaburulu

Kaburulu Desk

March 20, 2023 | 04:21 PM

Niharika-Chaitanya : మెగా జంట నిహారిక, చైతన్య విడిపోతున్నారా? వైరల్ అవుతున్న న్యూస్..

Niharika-Chaitanya :  సెలబ్రిటీలలో పెళ్ళిళ్ళు చేసుకోవడం,కొన్నాళ్ళకు విడిపోవడం మాములు విషయమే. సినిమా సెలబ్రిటీలతో అయితే ఈ తంతు మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా మెగా జంట నిహారిక – చైతన్య విడిపోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఓ సారి ఇదే వార్తలు రాగా నిహారిక అదంతా అబద్దం అని కొట్టిపారేసింది. నిహారిక – చైతన్య 2020 డిసెంబర్ 9న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో ఇరు కుటుంబాల సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.

అప్పట్నుంచి మెగా అభిమానులు ఈ జంటని చూసి మురిసిపోయారు. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వీరి ఫోటోలను అప్లోడ్ చేస్తూ వీరి ప్రేమను సోషల్ మీడియాలోనే చూపించారు. గతంలో ఓ సారి వీరు విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఈ వార్తలు ఊపందుకున్నాయి. సడెన్ గా ఏమైందో కానీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. అంతే కాకుండా చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ లో వీరిద్దరి పెళ్లి ఫోటోలు, వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు అన్ని డిలీట్ చేశాడు.

Keerthy Suresh : కాటుక కళ్ళతో కుర్రాళ్లను మాయలో పడేస్తున్న కీర్తి సురేష్..

దీంతో నిహారిక – చైతన్య విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలపై వీరిలో ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే మెగా అభిమానులకు మరో షాక్ తప్పదు. ఇప్పటికే చిరంజీవి కూతురు శ్రీజ విషయంలో ఇంకా చాలా మంది డైలమాలోనే ఉన్నారు. శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ తో కూడా విడిపోయిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాళ్ళు మాత్రం స్పందించలేదు. ఇప్పుడునీహారిక విషయంలో కూడా ఇలా వార్తలు వస్తుండటంతో మెగా అభిమానులు మరింత డైలమాలో పడ్డారు.