Tirumala: శ్రీవారి ఆలయ లడ్డూ కౌంటర్‌లో చోరీ.. ఏకంగా వెంకన్నకే ఎసరుపెట్టిన దొంగ!

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 05:01 PM

Tirumala: శ్రీవారి ఆలయ లడ్డూ కౌంటర్‌లో చోరీ.. ఏకంగా వెంకన్నకే ఎసరుపెట్టిన దొంగ!

Tirumala: కలియుగ వైకుంఠంగా.. కోరిన కోరికలు తీర్చే వడ్డీ కాసుల వాడిగా పిలుచుకునే వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా తిరుమలకు విశిష్టత. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచ ప్రఖ్యాత గాంచిన దేవాలయం. అయితే, తిరుమలలో ఇటీవల వివాదాస్పద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈమధ్యనే ఆలయంపై డ్రోన్ సంచరించిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటన మరువక ముందే తాజాగా లడ్డు కౌంటర్ లో దొంగతనం జరిగింది.

ఆదమరచి అంతా నిద్రుస్తున్న వేళ ఆ దొంగ ఏకంగా వెంకన్నకే ఎసరు పెట్టాడు. లడ్డూ కౌంటర్ బాయి నిద్రిస్తుండగా రెండు లక్షల పైగా నగదును దోచుకెళ్లాడు ఓ దుండగుడు. 36వ నెంబర్ లడ్డూ కౌంటర్ లో ఈ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షలు చోరి అయినట్లు గుర్తించిన టీటీడీ.. దీనిపై తిరుపతి వన్‌టౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తిస్తున్నారు.

ఈ దొంగ గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు పాత కేసులను కూడా స్టడీ చేస్తున్నారు. నిందితుడిని అరేస్ట్ చెయ్యడానికి ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే తిరుమల లాంటి అత్యంత భద్రతా, నిఘా కలిగిన దైవ సన్నిధానంలో ఇలా కౌంటర్ లో దొంగతనం జరగడం విజిలెన్స్ లోపంతోనే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలలో భద్రత కొరవడిందని భక్తుల నుంచి తరచుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈమధ్యనే డ్రోన్ కలకలంపై టీటీడీ ఈఓ ధర్మా రెడ్డి వివరణ ఇచ్చారు. భద్రతపై ఎక్కడా
రాజీపడబోమని, తిరుమలలో హై సెక్యూరిటీ వ్య వస్థ ఉందని అన్నారు. త్వరలో కొండపై డ్రోన్ నియంత్రణ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తామని కూడా చెప్పారు. ఈవో అలా చెప్పి రోజులు కూడా గడవకముందే లడ్డూ కౌంటర్ లోనే చోరీ షాక్ కి గురిచేస్తుంది. కౌంటర్లలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక, విశ్రాంతి గదులు, ధర్మసత్రాలలో పరిస్థితి ఏంటని భక్తులు ఆవేదన వక్తం చేస్తున్నారు.