Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు!

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 03:56 PM

Nagababu : చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ నాకు నమ్మకం లేదు.. నాగబాబు!

Nagababu : మెగాస్టార్ చిరంజీవి.. సినిమాల్లో తన నటనకి గాను స్టార్ హోదాని సొంతం చేసుకున్నాడు. దశాబ్దాలు కాలం నెంబర్ వన్ పొజిషన్‌ని ఎంజాయ్ చేశాడు. సినిమాలు చేస్తున్న సమయంలోనే చిరంజీవి రక్తదానం, కళ్ళ దానం వంటి సేవ కారిక్రమాలు చేపట్టి.. తన గొప్ప మనసుని చాటుకున్నాడు. ఆ తరువాత ప్రజలకి మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాలు వైపు అడుగులు వేశాడు.

Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్..

సొంత పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగిన చిరంజీవి, అక్కడ రాణించ లేకపోయాడు. ఆ దెబ్బతో మళ్ళీ సినిమాలు వైపు వచ్చిన చిరు.. వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చిరు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చాడు.

ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో జరిగిన ఫ్యాన్స్ మీట్ లో నాగబాబు పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “చిరంజీవి గారి పొలిటికల్ రీఎంట్రీపై నాకు నమ్మకం లేదు” అని వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది. కాగా ప్రెజెంట్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలయిన పాటలు, టీజర్ మూవీపై అంచనాలు పెంచేసిని.