Veera Simha Reddy : ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న వీరసింహారెడ్డి..

Kaburulu

Kaburulu Desk

December 27, 2022 | 04:16 PM

Veera Simha Reddy : ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసుకున్న వీరసింహారెడ్డి..

Veera Simha Reddy : నందమూరి బాలకృష్ణ హీరోగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. అఖండ చిత్రంతో బాలకృష్ణ, క్రాక్ మూవీతో డైరెక్టర్ గోపీచంద్ ఫుల్ ఫార్మ్‌లో ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Veera Simha Reddy : ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అంటున్న బాలయ్య..

సంక్రాంతికి రిలీజ్ అవుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే మూవీలోని ఒకొక సాంగ్ ని రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ప్రతిదీ గ్రాండ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్‌ని కర్నూల్ కొండా రెడ్డి బుర్జ్ దగ్గర గ్రాండ్ గా నిర్వహించారు.

ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారంటా దర్శకనిర్మాతలు. జనవరి 6న ఒంగోలులో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు. అయితే ఈ వార్తలుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్, మలయాళ బ్యూటీ హనీ రోజ్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.