Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్..

Kaburulu

Kaburulu Desk

November 28, 2022 | 01:48 PM

Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్..

Chiranjeevi :  గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని మన మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు చిరంజీవి గోవా లో ఈ అవార్డుని అందుకున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ అవార్డు తీసుకున్న చిరంజీవి వేదికపై ఎమోషనల్ అయి మాట్లాడారు.

గోవా ఫిలిం ఫెస్టివల్ లో అవార్డు తీసుకున్న సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ”కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. అందులో ఇది కూడా. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టాను. నా తల్లిదండ్రులు శివశంకర ప్రసాద్ గా జన్మనిచ్చారు. సినీ పరిశ్రమ నాకు చిరంజీవిగా జన్మనిచ్చింది. నాలుగున్నర దశాబ్దల ప్రయాణంలో పదేళ్లు సినిమాకు దూరంగా ఉన్నాను. అయినా నాపై ఇప్పటికీ అదే అభిమానం, ప్రేమ చూపిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాల విలువ తెలిసింది.”

Krishna 13th Day Ceremony : కృష్ణ సంస్మరణ సభలో కుటుంబ సభ్యులు..

”ప్రేక్షకుల హృదయాల్లో నా స్థానం పదిలం. సినిమాలకి దూరమై తిరిగి వచ్చిన తర్వాత నాపై ప్రేమ మరింత రెట్టింపైంది. నా జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు నేను దాసున్ని. నన్ను ఈ అవార్డుకు గుర్తించినందుకు ప్రదాని నరేంద్రమోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏ రంగంలోనైనా అవినీతి ఉండొచ్చు కానీ సినీ పరిశ్రమలో అవినీతి లేదు. సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే కొలమానం. గతంలో నేను ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నాను. కానీ అప్పుడు దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫోటో కూడా ఉండేది కాదు అని బాధపడ్డాను. కానీ ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది. అందుకు చాలా సంతోషిస్తున్నాను” అని తెలిపారు.