Chiranjeevi : వైరల్ అవుతున్న చిరంజీవి ట్వీట్.. ‘రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’

Kaburulu

Kaburulu Desk

September 20, 2022 | 01:34 PM

Chiranjeevi : వైరల్ అవుతున్న చిరంజీవి ట్వీట్.. ‘రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు’

Chiranjeevi :  చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా షూట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ దసరాకి చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో రానున్నారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా మోహన రాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాధ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయి సినిమాపై అంచనాలని పెంచేసింది. తాజాగా చిరంజీవి తన ట్విట్టర్లో ఓ వాయిస్ ట్వీట్ చేశారు. ఈ వాయిస్ ట్వీట్ లో.. ”రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు” అనే డైలాగ్ ఉంది. అయితే ఈ డైలాగ్ ఇప్పుడు పెట్టారేంటి అంటూ వైరల్ గా మారింది. కొంతమంది ఇది గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ అని, మరికొంతమంది ఇది రాజకీయాలకు రిలేటెడ్ అని అంటున్నారు.

Allu Arjun : పుష్ప 2 గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. తగ్గేదేలే అంటూ స్టేజి మీదే..

సాధారణంగా ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ సినిమాలోది అని లూసిఫర్ సినిమా చూసిన వాళ్లకి అర్ధమవుతుంది. కానీ సినిమాలో చాలా డైలాగ్స్ ఉండగా రాజకీయాలకి రిలేటెడ్ గా, తనకి కూడా వర్తించేలా ఉన్న ఈ డైలాగ్ నే ఎందుకు పోస్ట్ చేయాలి అని అంటున్నారు. ఈ డైలాగ్ చిరంజీవికి కూడా వర్తిస్తుంది. కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్న చిరంజీవి రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. ఈ డైలాగ్ పోస్ట్ చేయడంతో చిరంజీవి రాజకీయం గురించి మాట్లాడుతున్నారా లేక సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నారా అని అంతా చర్చించుకుంటున్నారు.