Chiranjeevi : అందరూ అనుకున్న టైటిలే పెట్టారుగా.. బాస్ ఊర మాస్ సినిమా రాబోతుంది..

Kaburulu

Kaburulu Desk

October 24, 2022 | 01:20 PM

Chiranjeevi : అందరూ అనుకున్న టైటిలే పెట్టారుగా.. బాస్ ఊర మాస్ సినిమా రాబోతుంది..

Chiranjeevi :  మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. అభిమానులు కోరుకునే తనలోని మాస్ యాంగిల్ ని కొంతవరకు చూపించి సక్సెస్ అయ్యారు. త్వరలో చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాతో రాబోతున్నారు. మెగా 154 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రవితేజ ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

RRR Team in Japan : జపాన్‌లో RRR టీమ్ సందడి..

తాజాగా దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉండి అందరికి తెలిసిన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ నే పెట్టారు. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు టైటిల్ టీజర్ అంటూ చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో చిరంజీవి మాస్ లుక్స్ చూపించారు. టైటిల్ టీజర్ అద్భుతంగా ఉంది. ఫుల్ మాస్ సినిమాగా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ టైటిల్ టీజర్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.