Allu Arjun : పుష్ప 2 గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. తగ్గేదేలే అంటూ స్టేజి మీదే..

Kaburulu

Kaburulu Desk

September 19, 2022 | 09:03 AM

Allu Arjun : పుష్ప 2 గురించి మాట్లాడిన అల్లు అర్జున్.. తగ్గేదేలే అంటూ స్టేజి మీదే..

 

Allu Arjun :  పుష్ప సినిమా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. పాటలు, డైలాగ్స్, అల్లు అర్జున్ మేనరిజమ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. వరల్డ్ వైడ్ వైరల్ గా మారాయి. ఇక పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప 2 సినిమా కోసం ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడో మొదలుపెట్టాల్సిన పుష్ప 2 ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు చిత్ర యూనిట్.

పుష్ప 2 సినిమా గురించి ఎలాంటి ప్రకటన లేదని బన్నీ అభిమానులు నిరాశ చెందుతున్న సమయంలో డైరెక్ట్ గా అల్లు అర్జున్ స్టేజి మీద పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగగా దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ అల్లూరి సినిమా గురించి, శ్రీ విష్ణు గురించి మాట్లాడి ఆ తర్వాత పుష్ప సినిమా నాగురించి కూడా మాట్లాడారు.

Gautha Menon : ఏ మాయ చేసావే మహేష్ బాబుతో తీద్దామనుకున్నాను.. కానీ ఆయన..

అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ”నేను పుష్ప 2 సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్నాను. ఆల్రెడీ పుష్ప 2 సినిమా పనులు మొదలయ్యాయి. వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ సారి పుష్ప 2 తగ్గేదేలే” అని తన మేనరిజాన్ని చూపించాడు. దీంతో హాల్ అంతా బన్నీ అభిమానుల అరుపులతో దద్దరిల్లిపోయింది. పుష్ప 2 వర్క్ మొదలైందని బన్నీనే డైరెక్ట్ గా చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.