God Father : గాడ్ ఫాదర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా..

Kaburulu

Kaburulu Desk

October 17, 2022 | 11:44 AM

God Father : గాడ్ ఫాదర్ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు మోహన్ రాజా..

God Father :  ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ రేంజ్ కి తగ్గ హిట్ పడింది. ఈ సినిమాతో చిరంజీవితో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి దూసుకుపోతుంది ఈ సినిమా. గాడ్ ఫాదర్ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాకి రీమేక్ అని తెలిసిందే.

లూసిఫర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందని లూసిఫెర్ 2 అని ఇటీవల పృద్విరాజ్ సుకుమారన్, మోహన్ లాల్ ప్రకటించారు. దీంతో గాడ్ ఫాదర్ కి కూడా సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. తాజాగా దర్శకుడు మోహన్ రాజా ఇచ్చిన ఓ సక్సెస్ ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Nayan-Vignesh : నయనతారకి పెళ్లయి ఆరేళ్లయిందా??

మోహన్ రాజా మాట్లాడుతూ.. చిరంజీవి గారు ఇలాంటి మాస్, యాక్షన్ పాత్రలు ఎంత బాగా చేస్తారో అందరికి తెలిసిందే. గాడ్ ఫాదర్ సినిమాతో మా టీంపై అందరికి నమ్మకం ఏర్పడింది. చిరంజీవి గారిని ఇలాంటి పాత్రల్లో మళ్ళీ మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. చిరంజీవి గారు అవకాశం ఇస్తే కచ్చితంగా గాడ్ ఫాదర్ 2 ఉంటుంది అని చెప్పారు. దీంతో గాడ్ ఫాదర్ 2 సినిమా ఉండే ఛాన్సులు ఉన్నాయని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో చూడాలి.