Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి..

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 10:54 AM

Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి..

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. చిరు నటిస్తున్న కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. పక్కా మాస్ కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Chiranjeevi : ఒకప్పుడు బాధపడ్డాను.. అవినీతి లేని రంగం సినీ పరిశ్రమ ఒక్కటే.. మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్..

ఇక ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్నప్పటికీ, ఇప్పటివరకు కచ్చితమైన రిలీజ్ డేట్ ని ప్రకటించలేదు. అలాగే హీరోయిన్ ఫస్ట్ లుక్ గాని, విలన్ ఎవరన్నది గాని తెలియజేయలేదు. టైటిల్ మరియు ఒక సాంగ్ తప్ప మరో అప్డేట్ లేదు. ఆచార్య, గాడ్ ఫాదర్ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నపటికీ, ఓపెనింగ్స్ ని డిసైడ్ చేసేది ప్రమోషన్స్.

మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే వస్తున్న మరో మూవీ బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’. రిలీజ్ డేట్ ని ప్రకటించి సంక్రాంతి భారీలో తన స్థానాన్ని భర్తీ చేసుకుంది. మరి ఇప్పటికైనా ఈ విషయాన్ని గమనించి వాల్తేరు వీరయ్య టీమ్ సినీ ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెడతారేమో చూడాలి. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.