RC15 : 2024 సంక్రాంతికి RC15 రిలీజ్..

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న RC15 ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట.

Kaburulu

Kaburulu Desk

January 31, 2023 | 07:12 PM

RC15 : 2024 సంక్రాంతికి RC15 రిలీజ్..

RC15 : టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. వచ్చే ఏడాది సంక్రాంతి బరి పై ఇప్పటి నుంచే కన్నేసి పెడుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి తన సినిమా ‘వరిసు’ని రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో అటువంటి ఇబ్బందులు మళ్ళీ పడకూడదు అని ఇప్పుడు నుంచే సంక్రాంతి డేట్ ని బ్లాక్ చేసి పెడదామన్న ఆలోచన చేస్తున్నాడట. ప్రస్తుతం దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం RC15. ఈ మూవీ దిల్ రాజు బ్యానర్ లో 50వ సినిమాగా తెరకెక్కుతుంది. దీంతో దిల్ రాజు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Ram Charan : RC15లో నత్తి వాడిగా నటించబోతున్న చరణ్?

తమిళ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శంకర్ మూవీ మేకింగ్ అంటే ఖర్చు ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సినిమాని దాదాపు రూ.170 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సోషల్ ఎలిమెంట్ ని కమర్షియల్ గా చెప్పడం శంకర్ స్టైల్. కానీ గత కొన్ని సినిమాలు నుంచి ఆ ఫార్ములా పక్కన పెట్టి ఆడియన్స్ ముందుకు వచ్చాడు శంకర్. అయితే RC15 మళ్ళీ శంకర్ మార్క్ స్టైల్ కనిపించబోతుంది. సినిమాకి ఇదే హైలైట్ అనుకుంటే, మరో హైలైట్.. ఈ చిత్రానికి మరో తమిళ దర్శకుడు కథని అందించడం. రజినీకాంత్ ‘పేట’ తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథని అందిస్తున్నాడు.

ప్రస్తుతం శంకర్ ఈ సినిమాతో పాటు ఇండియన్-2 ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్-2 అక్టోబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో శంకర్ అండ్ దిల్ రాజు ఒక మాట మీదకి వచ్చి, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. త్వరలో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు అని వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజమో. కాగా ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.