Ram Charan : RC15లో నత్తి వాడిగా నటించబోతున్న చరణ్?

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 07:15 PM

Ram Charan : RC15లో నత్తి వాడిగా నటించబోతున్న చరణ్?

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘RC15’. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా వస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Ram Charan :రామ్‌చరణ్ సినిమాలో మలయాళ సూపర్ స్టార్?

ఈ మూవీలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి తండ్రి పాత్ర, మరొకటి కొడుకు పాత్ర. అయితే ఇక ఈ సీనియర్ చరణ్ పాత్రకి కొంచెం నత్తి ఉండబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలో వినిపిస్తున్నాయి. గతంలో రంగస్థలం సినిమాలో చెవిటి వాడిగా నటించిన రామ్ చరణ్, ఇప్పుడు నత్తి వాడిగా తనలోని నటుడికి మరోసారి పరీక్ష పెట్టబుపోతున్నాడట.

అలాగే ఈ సినిమాలో మలయాళ నటుడు మోహన్ లాల్ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం శంకర్ ఎంచుకున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజామా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.