Gautham Menon : ‘ఛెల్లో షో’ సినిమాని ఆస్కార్‌కి ఎంపిక చేశారంటే కచ్చితంగా ఏదో కారణం ఉంటుంది.. నేను సినిమా చూడలేదు..

Kaburulu

Kaburulu Desk

September 26, 2022 | 08:40 AM

Gautham Menon : ‘ఛెల్లో షో’ సినిమాని ఆస్కార్‌కి ఎంపిక చేశారంటే కచ్చితంగా ఏదో కారణం ఉంటుంది.. నేను సినిమా చూడలేదు..

Gautham Menon :  రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమాని ప్రపంచం నలుమూలలా అభినందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు సినీ ప్రేమికులు, ప్రేక్షకులు, టెక్నీషియన్స్, నటులు.. అందరూ RRR సినిమాని అభినందిస్తున్నారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలుస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి RRR సినిమా కాకుండా భారత్ నుంచి ఛెల్లో షో అనే సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచింది. దీంతో చాలా మంది నిరాశ చెందారు.

దీనికంటే ముందే రాజమౌళి RRR సినిమాకి ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా ఫిలిం మేకింగ్ మారదు అని తెలిపారు. ఆస్కార్ నామినేషన్స్ లో RRR లేకపోవడం, ఛెల్లో షో సినిమా ఎంపికవ్వడంపై చాలామంది ఒక్కోలా స్పందించారు. తాజాగా ఛెల్లో షో సినిమా ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపికవడంపై దర్శకుడు గౌతమ్ మీనన్ స్పందించారు.

Hero Nikhil : అసలు మనకి ఆస్కార్ ఎందుకు.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో ఛెల్లో షో సినిమా ఆస్కార్ ఎంపికపై మీ అభిప్రాయం ఏంటి అని గౌతమ్ మీనన్ ని మీడియా ప్రతినిధులు అడగడంతో గౌతమ్ మీనన్ స్పందిస్తూ.. ”నాకు తెలిసినంతవరకు అన్ని అర్హతలున్న సినిమానే నామినేషన్స్ కి ఎంపిక చేస్తారు. ‘ఛెల్లో షో’ సినిమాని నేను ఇంకా చూడలేదు కాబట్టి ఆ సినిమా గురించి మాట్లాడను. సెలెక్షన్ కమిటీలో అనుభవం ఉన్నవాళ్లు, మేధావులు ఉన్నారు. ఈ సినిమానే సెలెక్ట్ చేశారంటే కచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాని చూస్తాను” అని అన్నారు.