Ishari K Ganesh : సినిమా సూపర్ హిట్.. హీరోకి కోటి రూపాయల కారు, డైరెక్టర్ కి ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Kaburulu

Kaburulu Desk

September 26, 2022 | 08:33 AM

Ishari K Ganesh : సినిమా సూపర్ హిట్.. హీరోకి కోటి రూపాయల కారు, డైరెక్టర్ కి ఖరీదైన బైక్ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

Ishari K Ganesh : వల్లభ, మన్మధ.. లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన తమిళ హీరో శింబు ఆ తర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు. ఇటీవల ‘మానాడు’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు హీరోగా ‘వెందు తానింధాతు కాడు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని తెలుగులో ‘ది లైఫ్‌ ఆఫ్ ముత్తు’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించడంతో శింబు మరో హిట్ అందుకున్నాడు.

Tabu : 50 వేలు పెట్టి అందం కోసం ఓ క్రీమ్ కొన్నాను.. రెండు సార్లు రాశాను.. ఆ తర్వాత..

‘వెందు తానింధాతు కాడు’ సినిమా తమిళ్ లో మంచి విజయం సాధించి కలెక్షన్లు కూడా బాగా రావడంతో ఆ సినిమా నిర్మాత ఇషారి.కే గణేష్.. హీరో, డైరెక్టర్స్ కి ఖరీదైన గిఫ్టులు ఇచ్చాడు. హీరో శింబుకి కోటి రూపాలయ విలువ చేసే టొయోటొ న్యూ వెల్‌వైర్‌ కారును గిఫ్టుగా ఇచ్చాడు. అలాగే డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్‌కు ఖరీదైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను గిఫ్టుగా ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.