Hero Nikhil : అసలు మనకి ఆస్కార్ ఎందుకు.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

September 23, 2022 | 09:05 AM

Hero Nikhil : అసలు మనకి ఆస్కార్ ఎందుకు.. హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..

Hero Nikhil :  రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆస్కార్ కి వెళ్తుందని అందరూ భావించారు. కానీ భారతదేశం నుంచి RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో నిలవలేదు. దీంతో చాలా మంది నిరాశ చెందారు. RRR సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో లేకపోవడంపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా దీనిపై హీరో నిఖిల్ కూడా కామెంట్స్ చేశాడు. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు యువ హీరో నిఖిల్. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో RRR సినిమాని ఆస్కార్ కి పంపలేదు దానిపై మీరేమంటారు అని అడగడంతో నిఖిల్ ఆసక్తికరంగా జవాబు ఇచ్చాడు.

Ira Khan : అమీర్‌ఖాన్ కూతురికి పబ్లిక్‌గా ప్రపోజ్ చేసి కిస్ ఇచ్చిన బాయ్‌ఫ్రెండ్

RRR సినిమా ఆస్కార్ కి నామినేట్ అవ్వకపోవడంపై నిఖిల్ మాట్లాడుతూ.. ”చాలా మంది ఆస్కార్ అవార్డుని ఇష్టపడతారు. కానీ నా వరకు ఆస్కార్ పై వేరే అభిప్రాయం ఉంది. ఒక సినిమాకి ప్రజల ఆదరణ, ప్రేమ, ప్రశంసలు ఉంటే అదే గొప్ప అవార్డు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు RRR సినిమాని ఆదరించారు. అలాంటప్పుడు ఇంక ఆస్కార్ ఎందుకు. నేనైతే ఆస్కార్ కి ప్రాముఖ్యత ఇవ్వను. మన సినిమాలు రిలీజయిన ప్రతిచోటా బాగా ఆడుతున్నాయి. అన్నిచోట్లా నుంచి మన సినిమాలని అభినందిస్తున్నారు. అలాంటప్పుడు మనకి ఆస్కార్ సర్టిఫికెట్ ఎందుకు. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకి వస్తున్న ఆదరణ చూసిన తర్వాత మనకి ఆస్కార్ అవసరంలేదు అనిపిస్తుంది”అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.