Balakrishna : ఫ్లోలో అన్న మాటలని వివాదం చేశారు.. ఏఎన్నార్ నాకు బాబాయ్..

బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల ప్రస్తావన రావడంతో రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని.............

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 06:55 AM

Balakrishna : ఫ్లోలో అన్న మాటలని వివాదం చేశారు.. ఏఎన్నార్ నాకు బాబాయ్..

Balakrishna :  బాలకృష్ణ ఇటీవల వీరసింహారెడ్డి సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడుతూ అనుకోకుండా సీనియర్ హీరోల ప్రస్తావన రావడంతో రామారావు, రంగారావు, అక్కినేని, తొక్కినేని.. అంటూ మాట్లాడారు. అయితే ఇది కావాలని మాట్లాడింది కాదని ఆ స్పీచ్ మొత్తం చూస్తే ఎవరికైనా అర్ధమవుతుంది. బాలకృష్ణ ఫ్లోలో అలా మాట్లాడటంతో కొంతమంది ఆ వ్యాఖ్యలని సపరేట్ గా వైరల్ చేశారు. దీంతో అక్కినేని అభిమానులు బాలయ్యపై సీరియస్ అయ్యారు.

అక్కినేని అభిమానులు బాలకృష్ణ పై విమర్శలు చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా ఇండైరెక్ట్ గా స్పందిస్తూ.. నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం, మనల్ని మనం కించపరుచుకోవటమే అంటూ ట్వీట్స్ చేశారు. ఈ ట్వీట్స్ వివాదాన్ని మరింత పెద్దదిగా చేశాయి. అక్కినేని అభిమానులు, నందమూరి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ కూడా నడిచాయి. ఇదే వివాదంపై ఎస్వీ రంగారావు మనవళ్లు మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు అవి. వాటిలో తప్పేమి లేదు. వివాదాన్ని పెద్దది చేయకండి అని అన్నారు.

Sharwanand : నిశితార్థం చేసుకున్న శర్వానంద్.. అమ్మాయి ఎవరో తెలుసా??

గురువారం నాడు రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ అనంతరం మీడియాతో మాట్లాడగా ఈ వివాదంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై బాలకృష్ణ స్పందిస్తూ.. ఆ రోజు చేసిన వ్యాఖ్యలు యాదృశ్చికంగా అన్న మాటలే తప్ప ఆయనను కించపరచటానికి కాదని అందరికి తెలుసు. కొంతమంది కావాలని ఈ వ్యాఖ్యలని వివాదం చేశారు. ఎన్టీఆర్‌, అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు. ఏఎన్నార్ ని నేను బాబాయ్ అని పిలుస్తాను. పొగడ్తలకి దూరంగా ఉండటం నేను బాబాయ్ దగ్గర్నుంచి నేర్చుకున్నాను. నేను ఫ్లోలో అన్న మాటలని వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు. ఎన్టీఆర్‌ పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును కూడా మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికే అందించాము. ఆయనతో ఉన్న సంబంధం నాకు తెలుసు. బయటి వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను అని అన్నారు. దీనిపై అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.