Raashii Khanna : బాహుబలి ఆడిషన్ కి వెళ్తే.. అందం ఎక్కువుందని రాజమౌళి రిజెక్ట్ చేశారు..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశిఖన్నా ఆసక్తికర విషయాన్ని తెలిపింది. రాజమౌళి బాహుబలి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసి రాశిఖన్నా కూడా ట్రై చేసిందట. అప్పటికి.............

Raashii Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసింది రాశిఖన్నా. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవలే ఫర్జి సిరీస్ తో ప్రేక్షకులని మెప్పించింది ఈ భామ. ప్రస్తుతం హిందీలో పలు సినిమాలు, సిరీస్ లు చేస్తోంది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాశిఖన్నా ఆసక్తికర విషయాన్ని తెలిపింది. రాజమౌళి బాహుబలి సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నారని తెలిసి రాశిఖన్నా కూడా ట్రై చేసిందట. అప్పటికి రాశి తెలుగులో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఆ ఆడిషన్ లో జరిగిన సంఘటనని ఇటీవల పంచుకుంది.
రాశిఖన్నా మాట్లాడుతూ.. నేను బాహుబలి సినిమాలో అవంతిక పాత్ర కోసం ఆడిషన్ కి వెళ్ళాను. రాజమౌళి గారికి ఆడిషన్ ఇచ్చాను. కానీ ఆ పాత్రకి అందంతో పాటు కొంచెం రఫ్ లుక్ కూడా కావాలి, యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి అన్నారు. నాకు మరీ అందం ఎక్కువుందని, నా ఫేస్ చాలా సాఫ్ట్ గా, బబ్లీగా ఉందని చెప్పారు. అయితే తన ఫ్రెండ్ సినిమాకి నేను సరిగ్గా సరిపోతాను అని, కథ బాగుంటుందని చెప్పి ఊహలు గుసగుసలాడే సినిమా ఆడిషన్ కి పంపించారు. ఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాను అని తెలిపింది. ఆ తర్వాత అవంతిక పాత్ర మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన సంగతి తెలిసిందే.