Medico Preeti Suicide Case: మెడికో ప్రీతిది హత్యా? ఆత్మహత్యా?.. పోలీసులు ఏం నిర్ధారించుకున్నారు?

Medico Preeti Suicide Case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ పీజీ విద్యార్థిని ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా?. పోలీసులు ఏం నిర్ధారించుకున్నారు. మెడికో ప్రీతీ పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని చనిపోయినట్లు పోలీసులు ప్రాధమిక విచారణలో నిర్ధారించగా.. వేధించిన సీనియర్ సైఫ్ ప్రీతీకి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని ప్రీతీ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే ప్రీతి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా.. సైఫ్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశాడని తండ్రి చెబుతున్నారు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. ప్రీతి కేసులో నిందితుడు సైఫ్
నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగుస్తుండగా ఆ తర్వాత అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి మళ్లీ జైలుకు పంపించమన్నారు.
కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న ఈ నాలుగు రోజులుగా సైఫ్ నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు కీలక అంశాలను నోట్ చేసుకున్నారు. ప్రీతి అస్వస్థతకు గురైన రోజు డ్యూటీలో ఉన్న హెడ్నర్స్ , స్టాఫ్ నర్స్, మరో ద్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ స్టేట్మెంట్లు ప్రీతి కేసులో కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్‌తో పాటు టాక్సికాలజీ రిపోర్టును పరిశీలించిన పోలీసులు సైఫ్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రీతి కేసులో ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
ఇప్పటి వరకు సైఫ్ స్టేట్మెంట్, లభించిన ఆధారాల పరంగా ప్రీతిని ఎవరో హత్య చేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా పోలీసులకు ఎక్కడా ఆధారాలు లభించలేదని తెలుస్తుంది. దీంతో పోలీసులు ఇది హత్య కాదు అనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయినా, పోలీసులు మరింత లోతుగా ఈ కేసును పరిశీలించనున్నట్లు తెలుస్తుంది.