Earthquake in Japan: జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కెల్ పై 6.1గా నమోదు.. టర్కీ భూకంప ప్రభావంతో హడలెత్తిన జపనీయులు!

Kaburulu

Kaburulu Desk

February 25, 2023 | 10:33 PM

Earthquake in Japan: జపాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కెల్ పై 6.1గా నమోదు.. టర్కీ భూకంప ప్రభావంతో హడలెత్తిన జపనీయులు!

Earthquake in Japan: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భూకంప ప్రభావం టెర్రర్ పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుండి వివిధ దేశాలలో భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన టర్కీ, సిరియా దేశాలలో సంబంధించిన భూకంపం ప్రభావంతో అక్కడ వేలాది మంది శిధిలాల కింద సమాధిగా కాగా.. లక్షలాది మంది నిరాశ్రులయ్యారు. మళ్లీ కొద్ది రోజుల క్రితం అదే ప్రాంతంలో భూకంపం రాగా పదుల సంఖ్యలో మరణించారు. వందల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఆ భయం అలా ఉండగానే జపాన్ లో నేడు భూకంపం సంభవించింది.

జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు అప్రమత్తమయ్యారు. నెమురో ప్రాంతంలో 61 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (NIED) వెల్లడించింది. భూకంప ప్రభావంతో ఆస్తినష్టం, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా, భారీ భూకంపం వచ్చినా, సునామీ ముప్పు లేదని అక్కడి అధికారులు తెలిపారు.

కాగా, ఫసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న జపాన్ కు కూడా భూకంపాల ముప్పు ఎక్కువే. ఇక్కడి ఇళ్లను కూడా భూకంపాలను తట్టుకునే విధంగా కలప, తేలికపాటి పదార్థాలతో నిర్మిస్తుంటారు. భూకంపాలను గుర్తించేందుకు జపాన్ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. భూకంప ప్రభావం వస్తున్న కొన్ని సెకండ్ల ముందే ఇక్కడ సైరన్లు మ్రోగుతాయి. ఇలాంటి టెక్నాలజీ ఉండడం వలనే ఇక్కడ ఎక్కువగా భూకంపాలు సంబంధించిన ప్రాణనష్టాన్ని నివారించగలుగుతున్నారు.