Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఆస్ట్రేలియా, జకార్తాపైనా ప్రభావం

Kaburulu

Kaburulu Desk

January 10, 2023 | 11:20 PM

Earthquake: ఇండోనేసియాలో భారీ భూకంపం.. ఆస్ట్రేలియా, జకార్తాపైనా ప్రభావం

Earthquake: భారీ భూకంపం ఇండోనేషియాను వణికించింది. తూర్పు ఇండోనేసియాలోని తనింబర్ దీవులలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా.. ఫలితంగా 5 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. దీని వల్ల అక్కడి ఇళ్లు ధ్వంసమవగా.. తనింబర్, మలుకు జిల్లాల్లో రెండు పాఠశాల భవనాలు, 124 ఇళ్లు దెబ్బ తిన్నాయని నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది.

భూకంప ప్రభావంతో పపువా, తూర్పు నుసా టెంగ్గారా ప్రావిన్స్ లతో పాటు జకార్తా, ఉత్తర ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో కనిపించింది. తూర్పు ఇండోనేసియాలోని 127,000 మంది నివాసితులు ఉన్న తనింబార్ దీవులకు సమీపంలోని బండా సముద్రంలో 7.6 తీవ్రతతో భారీగా భూమి ప్రకంపించింది. దీని వల్ల అక్కడి సమీపంలోని భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. తనింబర్ దీవులు, మలుకు జిల్లాల్లోని రెండు పాఠశాల భవనాలు, 124 ఇళ్లు దెబ్బ తిన్నాయన్నాయని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.

తనింబార్ దీవులకు సమీపంలోని బండా సముద్రంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించడం వల్ల ఇండోనేసియాతో పాటు పాపువా, తూర్పు నుసా, టెంగ్గారా ప్రావిన్స్ లతో పాటు జకర్తా, ఉత్తర ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాలలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించిన 3 గంటల తర్వాత ఇండోనేసియా వాతావరణ శాఖ సునామీ
హెచ్చరికను జారీ చేసింది. ఆస్ట్రేలియాకు ఉత్తరం వైపు 105 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

కాగా, లోతైన భూకంపాలు తక్కువ ఉపరితల నష్టాన్ని కలిగిస్తాయని.. కానీ విస్తృతంగా భూకంప ప్రభావాన్ని కలిగిస్తాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. భూకంప ప్రభావం గురించి స్థానిక వ్యక్తి ఒకరు మాట్లాడుతూ.. నేను మంచం మీద ఉన్నాను.. అప్పుడు నాకు కొద్దిగా వణుకు అనిపించింది. నేను మేల్కొన్నాను.. తర్వాత నా స్నేహితులు చాలా మంది దీనిని అనుభవించారని తెలుసుకున్నాను అని అంబన్‌లోని ఇండోనేషియా హమ్ది ఏఎఫ్పీకి చెప్పారు. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ మొదట సునామీ గురించి హెచ్చరించగా.. ఆపై హెచ్చరికను ఎత్తివేసింది.