Bahubali Thali: బాహుబలి థాలీ ఖరీదు రూ.2 వేలు.. తింటే రూ.లక్ష బహుమతి.. మన ఏపీలోనే!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 09:25 PM

Bahubali Thali: బాహుబలి థాలీ ఖరీదు రూ.2 వేలు.. తింటే రూ.లక్ష బహుమతి.. మన ఏపీలోనే!

Bahubali Thali: అదే పేర్లు, అదే కూరలు, అదే సాంబార్ అప్పడం, లేకపోతే అదే హైదరాబాద్ చికెన్ బిర్యానీ, అదే నాటుకోడి పెడితే జనాలు ఎగబడి తినే రోజులు పోయాయి. అందుకో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదొక ప్రత్యేకత ఉంటేనే హోటళ్లు, రెస్టారెంట్లు సక్సెస్ అవుతున్నాయి. ట్రైన్, జైల్, హిల్స్, అండర్ వాటర్, రోబోలు ఇలా ఏవేవో కొత్త కొత్త థీమ్స్ తో రెస్టారెంట్లు ఏర్పాటు చేసి జనాలను ఆకట్టుకుంటున్నారు. మరికొందరు కొత్త కొత్త పేర్లు.. లేదా కొత్త ఛాలెంజ్ లు విసిరి ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ స్టోరీ కూడా అలాంటిదే.

బాహుబలి థాలీ.. కాస్ట్ రూ.2 వేలు. ఇందులో 30 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. 30 నిమిషాల్లో తినే సత్తా మీలో ఉంటే కనుక లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోవచ్చు. ఏపీలోని అనంతపూర్ లోని నాయుడు గారి కుండ బిర్యానీ అనే రెస్టారెంట్ ఈ ఛాలెంజ్ విసిరింది. అసలు కథేంటి అంటే.. 30 రకాల వంటకాలను ఒక పెద్ద ప్లేట్ లో వడ్డిస్తారు. ఇందులో ఒక కుండ బిర్యాని, ఫిష్, నాటుకోడి, ఆమ్లెట్, గుడ్డు, చికెన్ అంతేకాక చికెన్ తో చేసిన వివిధ రకాల వంటకాలు, రెండు గ్లాసుల లస్సి, రెండు కూల్ డ్రింక్స్.. ఇలా మొత్తం 30 రకాల వంటకాలు అందిస్తారు. ఖరీదు రూ.2 వేలు

ఈ ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరించవచ్చు. 30 రకాల వంటకాలను ఎవరైతే 30 నిమిషాల్లో తినగలరో.. వారికి లక్ష రూపాయలు బహుమతి. హైదరాబాద్ లో ఇప్పటికే ఒక బ్రాంచ్ ఉన్న ‘నాయుడు గారి కుండా బిర్యాని‘ రెస్టారెంట్ వారు కొత్తగా అనంతపురంలో ఓ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ క్రమంలో ఈ ఛాలెంజ్ విసిరారు. అయితే, ఇన్ని ఐటమ్స్ పెట్టి కేవలం 30 నిమిషాల్లో అంటే అయ్యే పనేనా అనుకుంటున్నారా?! అయినప్పటికీ ఇప్పటికే ముగ్గురు యువకులు ఈ ఛాలెంజ్ గెలిచి లక్ష సంపాదించారు.