UK: అందరిలా మూత్ర విసర్జన చేయలేని మహిళ.. ఈమె వ్యాధిని డాక్టర్లు కూడా ఏం చేయలేరట!

Kaburulu

Kaburulu Desk

March 25, 2023 | 10:00 PM

UK: అందరిలా మూత్ర విసర్జన చేయలేని మహిళ.. ఈమె వ్యాధిని డాక్టర్లు కూడా ఏం చేయలేరట!

UK: మనకి అర్జంట్ వాష్ రూమ్ అవసరమైనా.. వీలు కాకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో మనకి అందరికీ తెలిసిందే. అందరూ ఏదో ఒక సందర్భంలో ఈ పరిస్థితిని అనుభవించే ఉంటారు. అలాంటిది మూత్ర విసర్జన చేయాలని ఉన్నా 14 నెలల పాటు చేయలేకపోతే ఆ నరకాన్ని ఊహించుకుంటేనే బాబోయ్ అనిపిస్తుంది. కానీ, ఓ మహిళ ఆ నరకాన్ని నెలల పాటు భరించింది. ఆమె జబ్బు ఏంటో డాక్టర్లు కనుకున్నా దానికి చికిత్స లేకపోవడంతో ఆమెకి ఉపశమనం కలిగించి కొంత విముక్తి కలిగించారు.

ఎల్లీ ఆడమ్స్ అనే బ్రిటన్ కు చెందిన మహిళ ఓ కంటెంట్ క్రియేటర్ గా పనిచేసేది. అయితే, 2020 అక్టోబర్‌లో అకస్మాత్తుగా ఓ రోజు ఆమెకు మూత్రం ఆగిపోయింది. మూత్ర విసర్జన చేయాలపిస్తున్నా వీలు కావడం లేదు. అప్పటి వరకూ ఆమె తీసుకున్న లిక్విడ్ పదార్ధాలతో యూరిన్ బ్లేడర్ నిండినా ఆమె మూత్ర విసర్జన మాత్రం కుదరలేదు. దీంతో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో చివరకు వైద్యులను ఆశ్రయించింది. ముందుగా ఆమె మూత్రాశయంలో పేరుకుపోయిన మూత్రాన్ని ట్యూబ్ ద్వారా తొలగించారు.

అనంతరం వివిధ పరీక్షలు చేసి ఆమెకి ఫౌలర్స్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తేల్చారు. ఈ సమస్య ఉన్న వారు సజావుగా మూత్ర విజర్జన చేయలేరు. ఈ వ్యాధికి కారణమేంటో కూడా తెలియదు. ఈ వ్యాధికి చికిత్సా విధానాలు కూడా తెలియదు. దీంతో.. కొన్నాళ్ల పాటు సన్నని రబ్బరు పైపు సాయంతోనే ఆమె మూత్ర విసర్జన చేయాల్సి వచ్చింది. కొన్నాళ్ల తర్వాత వైద్యులు మూత్రవిసర్జనకు కారణమయ్యే నాడులను ప్రేరేపించేందుకు వెన్నుముక కింద ఓ చిన్న పరికరాన్ని అమర్చారు.

దీంతో ప్రస్తుతానికి ఆ మహిళకు కాస్తంత ఉపశమనం లభించింది. పరికరాన్ని అమర్చాక క్యాథెటర్ అవసరం దాదాపు 50 శాతం తగ్గిందని ఆమె ఆనంద పడిందంటే ఆమె ఎంత నరకం చూసిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, ఆమె తన జీవితాంతం ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ట్యూబ్ అవసరం ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు స్పష్టం చేశారు. తాజాగా ఆమె ఓ ఓ అంతర్జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈమె సమస్య ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.