UK bans TikTok: టిక్ టాక్ పై మరో దేశం నిషేధం.. బ్రిటన్ లోనూ సోషల్ యాప్ పై బ్యాన్!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 08:51 PM

UK bans TikTok: టిక్ టాక్ పై మరో దేశం నిషేధం.. బ్రిటన్ లోనూ సోషల్ యాప్ పై బ్యాన్!

UK bans TikTok: టిక్ టాక్.. ఈ షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ గురించి నెటిజెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకప్పుడు భారత్ లో సెన్సేషన్ సృష్టించిన మోస్ట్ ఎంటర్టైనింగ్ యాప్ లో టిక్ టాక్ మొదటి వరుసలో ఉంటుందనే చెప్పాలి. భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే నెటిజన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకొని సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించింది.

ఈ క్రమంలోనే కనీసం మనిషి తన తలను పక్కకు తిప్పుకునేందుకు కూడా వీలులేని విధంగా అందరిని టిక్ టాక్ బానిసలుగా మార్చుకుందని చెప్పాలి. యువత దగ్గర నుంచి ముసలి, ముతక, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అంతా టిక్ టాక్ వినియోగదారులుగా మారిపోయారు. అయితే, ఆ తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం చైనా యాప్ అయిన టిక్ టాక్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

భారత్ తర్వాత మరికొన్ని దేశాలు కూడా ఈ చైనా యాప్ నిషేధానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా సహా చాలా దేశాలలో టిక్ టాక్ పై నిషేధం కొనసాగుతుంది. ఇప్పుడు యాప్ టిక్ టాక్ కు బ్రిటన్ లోనూ కష్టకాలం తప్పలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

టిక్ టాక్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అనుమతించిన థర్డ్ పార్టీ యాప్ లను మాత్రమే వినియోగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పరికరాల్లో ఎంతో సున్నితమైన సమాచారం ఉంటుందని, అందుకే ముప్పును నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.