Ram Charan : సినిమాలకు కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుందాం అనుకున్నా.. రామ్చరణ్!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేస్ లో ఉంది. దీంతో చిత్ర యూనిట్ అమెరికాలో ఆస్కార్ క్యాంపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ రేస్ లో ఉంది. దీంతో చిత్ర యూనిట్ అమెరికాలో ఆస్కార్ క్యాంపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ ఆడియన్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సినిమాకి బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను అంటూ తెలియజేశాడు. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చాక ఇప్పుడు బ్రేక్ తీసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నారా? రామ్ చరణ్ అన్నది.. ఇప్పుడు బ్రేక్ తీసుకోవాలని కాదు, RRR మూవీ ఆఫర్ రాకముందు సినిమాలకు కొంత బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడట.
Naatu Naatu : నాటు నాటు పాటకు లైవ్ లో స్టెప్పులేసిన BTS సింగర్.. స్పెషల్ పోస్ట్ చేసిన RRR యూనిట్..
2007 లో చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే వచ్చాడు. దీంతో కొన్నాళ్ళు సినిమాలు నుంచి బ్రేక్ తీసుకోని ఏదైనా కొత్తగా నేర్చుకొని మళ్ళీ సినిమాలు చేదాం అని అనుకున్నాడట. కానీ అప్పుడే రాజమౌళి నుంచి RRR ఆఫర్ వచ్చింది. ఇక ఆ ఆలోచన పక్కన పెట్టేసి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు. ఈరోజు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆస్కార్ విషయానికి వస్తే.. ఈ నెల 12న అవార్డుల పురస్కారం జరగనుంది. మరి RRR ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టింస్తుందా? లేదా? చూడాలి.
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం RC15 చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మరో తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథని అందిస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సునిల్, ఎస్ జె సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండడంతో మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.