Naga Chaitanya : సమ్మర్‌లో ‘కస్టడీ’కి తీసుకుంటా అంటున్న నాగచైతన్య..

Kaburulu

Kaburulu Desk

December 29, 2022 | 06:29 PM

Naga Chaitanya : సమ్మర్‌లో ‘కస్టడీ’కి తీసుకుంటా అంటున్న నాగచైతన్య..

Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది ‘బంగార్రాజు’ వంటి సినిమాతో మంచి హిట్టుని అందుకున్న ఆ తరువాత ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో పరాజయాలని అందుకున్నాడు. దీంతో ఒక సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి తమిళ మాస్ డైరెక్టర్‌ని నమ్ముకున్నాడు. ‘మానాడు’ వంటి టైం లూప్ కాన్సెప్ట్‌తో అదిరిపోయే హిట్టుని అందుకున్న వెంకట్ ప్రభు ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు.

Nagarjuna : చైతో చేశాను.. నెక్స్ట్ అఖిల్‌తో చేస్తున్నాను.. ఏజెంట్, ఘోస్ట్ కలిసొస్తే ఎలా ఉంటుందో చూడండి..

ఈ సినిమాలో నాగచైతన్య నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ చిత్రంపై బజ్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు మేకర్స్.

సమ్మర్ హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో వేసవికి రిలీజ్ అయిన చైతు ‘100% లవ్’ సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కి ‘కస్టడీ’ని సిద్ధం చేస్తున్నాడు. మరి ఈసారి కూడా విజయాన్ని అందుకుంటాడా? లేదా? చూడాలి. ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.