Balakrishna : అక్కినేని-తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలు.. వారసులు కౌంటర్లు!

ఇటీవల జరిగిన 'వీరసింహుని విజయోత్సవం' సక్సెస్ మీట్ లో బాలకృష్ణ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి టాలీవుడ్ లో వివాదానికి తెర లేపాడు. తాజాగా బాలయ్యకి కౌంటర్ ఇస్తూ అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ స్పందించారు.

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 05:01 PM

Balakrishna : అక్కినేని-తొక్కినేని.. బాలయ్య వ్యాఖ్యలు.. వారసులు కౌంటర్లు!

Balakrishna : నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కోసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో మూవీ టీం ‘వీరసింహుని విజయోత్సవం’ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి టాలీవుడ్ లో వివాదానికి తెర లేపాడు.

Balakrishna : వీరసింహుని విజయోత్సవ సభలో ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ పంచులు వేసిన బాలయ్య..

వీరసింహారెడ్డి షూటింగ్ సమయంలోని విషయాలు గురించి మాట్లాడుతూ.. ‘షూటింగ్ చాలా సరదాగా జరిగింది. నాకు బాగా కాలక్షేపం అయ్యింది. ఎప్పుడు కూర్చున్న వేద శాస్త్రాల, నాన్నగారు డైలాగ్ లు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అని మాట్లాడుకునే వాళ్ళం’ అంటూ సీనియర్ ఎన్టీఆర్ సహా నటులను తక్కువ చేస్తూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్ స్పందించారు.

‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవటం’ అంటూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు చై అండ్ అఖిల్. అయితే ఈ నోట్ లో బాలకృష్ణని ప్రస్తావించకుండా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. అక్కినేని హీరోల కౌంటర్స్ తో వివాదం మరెంత ముదిరింది. మరి దీని పై బాలకృష్ణ వివరణ ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

కాగా దీని పై నాగార్జున ఇంకా పెదవి విప్పలేదు. అయితే దీని పై ఆల్‌ ఇండియా అక్కినేని ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్వేశ్వరరావు స్పందింస్తూ బాలకృష్ణ పై మండి పడ్డాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి వర్ధంతి (జనవరి 22) రోజున.. ఆయన గౌరవార్ధం మౌనం పాటించాల్సింది పోయి. ఆయనని అవమానిస్తూ మాట్లాడతావా? నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? ఆయనని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించడమే. వెంటనే బాలకృష్ణ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశాడు.