BiggBoss : మరోసారి బిగ్‌బాస్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

Kaburulu

Kaburulu Desk

November 25, 2022 | 12:54 PM

BiggBoss : మరోసారి బిగ్‌బాస్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

BiggBoss :  అన్ని భాషల్లో పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగులో కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ ఆరో సీజన్ తెలుగులో నడుస్తుంది. నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌ పై ఇప్పటికే చాలా మంది విమర్శలు చేశారు. ఈ షో ప్రజలని తప్పుదారి పట్టిస్తోందని, హౌజ్ లో సమాజ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటూ కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా రాజకీయ నాయకుడు సిపిఐ నారాయణ ఇప్పటికే చాలా సార్లు బిగ్‌బాస్‌ ని, నాగార్జునని విమర్శించాడు. బిగ్‌బాస్‌ ఒక బ్రోతల్ హౌజ్ లాంటిదని, అది సమాజానికి చాలా చెడ్డదని, దానివల్ల యువత చెడిపోతుందని కామెంట్స్ చేశారు. బిగ్‌బాస్‌ పై గతంలో కేసు కూడా వేశారు. తాజాగా మరోసారి నారాయణ బిగ్‌బాస్‌ పై స్పందించారు.

Samantha : రిలీజ్ ఆపాలంటూ.. యశోద సినిమాకి షాకిచ్చిన కోర్టు..

విజయవాడలో జరిగిన ఓ సిపిఐ మీటింగ్ లో మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ అనేది ఒక సాంఘిక దురాచారం. ఆ షోలో అసాంఘిక కార్యకలాపాయాలు జరుగుతున్నాయి. అదొక క్యాన్సర్ లాంటింది. సమాజానికి హాని చేస్తుంది. బిగ్‌బాస్‌ షోని బ్యాన్ చేయాలి అని అన్నారు. మరోసారి బిగ్‌బాస్‌ పై నారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.