Samantha : రిలీజ్ ఆపాలంటూ.. యశోద సినిమాకి షాకిచ్చిన కోర్టు..

Kaburulu

Kaburulu Desk

November 24, 2022 | 01:11 PM

Samantha : రిలీజ్ ఆపాలంటూ.. యశోద సినిమాకి షాకిచ్చిన కోర్టు..

Samantha :  సమంత చాలా రోజుల తర్వాత మెయిన్ లీడ్ లో నటించిన యశోద సినిమా ఇటీవల నవంబర్ 11 న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం అందుకొని కలెక్షన్స్ ని కూడా సాధిస్తుంది. ఈ సినిమాలో సమంత యాక్టింగ్, యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేసింది అంటూ ప్రేక్షకులు పొగిడేస్తున్నారు.

సినిమా రిలీజయిన నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంది చిత్ర యూనిట్. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నారు. డిసెంబర్ లో యశోద సినిమాని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో యశోద చిత్రయూనిట్ కి కోర్ట్ షాకిచ్చింది. ఓటీటీలో సినిమా రిలీజ్ ఆపాలంటూ యశోద నిర్మాణ సంస్థకి నోటీసులు పంపించింది.

యశోద సినిమా సరోగసీ, హాస్పిటల్స్ లో జరిగే అక్రమాల నేపథ్యంలో తెరకెక్కించారు. అయితే సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ హాస్పిటల్ కి ‘ఈవా’ అని పేరు పెట్టారు. ఆ హాస్పిటల్ లో అన్ని అక్రమాలు జరుగుతున్నట్టు సినిమాలో చూపించారు. బయట నిజంగానే ఈవా అనే ఓ హాస్పిటల్ ఉంది. దీంతో ఈ సినిమా వల్ల మా హాస్పిటల్ పేరు దెబ్బతింది అంటూ, యశోద సినిమా ఓటీటీ రిలీజ్ అయినా ఆపాలంటూ ఈవా హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో కేసు వేసింది.

Kantara : కాంతార సినిమా ఓటీటీలోకి.. థియేటర్లో మిస్ అయితే ఇక్కడ చూడండి..

కేసుని పరిశీలించిన కోర్టు యశోద సినిమా నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేస్తూ.. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో యశోద సినిమా రిలీజ్ చేయకూడదని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్‌ 19కి వాయిదా వేసింది. దీంతో యశోద చిత్ర యూనిట్ షాక్ అయ్యారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.