Salman Khan : బిగ్‌బాస్‌ హోస్ట్ చేయడం ఇష్టం లేదు.. 1000 కోట్లు ఇస్తే..

Kaburulu

Kaburulu Desk

September 30, 2022 | 02:33 AM

Salman Khan : బిగ్‌బాస్‌ హోస్ట్ చేయడం ఇష్టం లేదు.. 1000 కోట్లు ఇస్తే..

Salman Khan :  పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ హిందీలో గత కొన్ని సీజన్లుగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోని హోస్ట్ చేయడానికి సల్మాన్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు వార్తలు వస్తుంటాయి. ఈ సారి కొత్త సీజన్ కి ఏకంగా 1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ మీడియా సమావేశంలో సల్మాన్ ఖాన్ దీనిపై స్పందించారు.

బిగ్‌బాస్‌ కి తాను తీసుకునే రెమ్యునరేషన్ పై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ..”నేను కూడా చూశాను, కొంతమంది నాకు 1000 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని రాశారు. అసలు అంత రెమ్యునరేషన్ ఇస్తే ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను. నాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా అందులో సగం నా లాయర్ల ఫీజుకే పోతుంది. అయినా ఇలాంటి వార్తలు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఐటీ, ఈడీ శాఖల వాళ్ళు చూస్తే నిజం అనుకుంటారు” అని ఆ వార్తలు రాసిన వాళ్లకి కౌంటర్ ఇచ్చాడు సల్మాన్.

Saniya Iyappan : మీద చెయ్యేసిన అభిమాని.. చెంప చెళ్లుమనిపించిన హీరోయిన్..

ఇక బిగ్‌బాస్‌ గురించి మాట్లాడుతూ.. ”అసలు నాకు బిగ్‌బాస్‌ షో హోస్ట్ చేయడం ఇష్టం లేదు, కానీ తప్పట్లేదు. నేను చేయనని కూడా నిర్వాహకులకు చెప్పేశాను. కానీ వాళ్లకి కూడా వేరే ఛాయస్ లేక నన్ను తీసుకుంటున్నారు. వేరే వాళ్ళు దొరికితే నన్ను పక్కన పెట్టేస్తారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు” అని తెలిపారు. దీంతో సల్మాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో వైరల్ గా మారాయి.