VeeraSimha Reddy : జైజై బాలయ్య.. తమన్ అదరగొట్టేశాడుగా..

Kaburulu

Kaburulu Desk

November 25, 2022 | 12:57 PM

VeeraSimha Reddy : జైజై బాలయ్య.. తమన్ అదరగొట్టేశాడుగా..

VeeraSimha Reddy :  బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వీరసింహ రెడ్డి. అఖండ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడం, ఇప్పటికే రిలీజైన మాస్ టీజర్ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది. సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి జై బాలయ్య ఆంతం అంటూ ఓ మాస్ సాంగ్ ని విడుదల చేశారు. రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలయ్యే సాంగ్ జై బాలయ్య.. జైజై బాలయ్య అంటూ మాస్ బీట్ తో కొనసాగుతూ అదిరిపోయింది. రామజోగయ్య శాస్త్రి పాటని రాయగా తమన్ దర్శకత్వంలో కరీముల్లా ఈ పాటని పాడాడు.

BiggBoss : మరోసారి బిగ్‌బాస్‌పై నారాయణ సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది. బాలయ్య అభిమానులు ఈపాట విని ఫుల్ జోష్ ఫీల్ అవుతున్నారు. ఇక ఈ పాటలో బాలయ్య స్టెప్పులు కూడా చూపించారు. తమన్ కూడా ఈ పాటలో స్టెప్పులు వేయడం విశేషం.