Winter Skin Care : శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

November 24, 2022 | 01:31 PM

Winter Skin Care : శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసా?

Winter Skin Care : శీతాకాలంలో చలికి మన చర్మం, చేతులు పొడిబారుతుంటాయి. కాబట్టి మన చర్మాన్ని కాపాడుకోవాలి. ఇందుకు కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

*చర్మానికి మాయిశ్చరైజ్ చేయాలి, ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
*ముఖానికి ముల్తాన్ మట్టి మరియు రోజ్ వాటర్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీనితో చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
*చలికాలంలో అందరూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు కానీ గోరువెచ్చని నీటితో చేయాలి లేకపోతే చర్మం పొడిబారుతుంది.
* రాత్రి పడుకునే ముందు కూడా ఫేస్ ప్యాక్ చేసుకోవాలి అపుడు మన చర్మం పొడిబారకుండా ఉంటుంది.
* మన శరీరానికి తగినంత నీరు అందేలా చూడాలి రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని త్రాగాలి. అపుడు చర్మంలో తేమ శాతం ఉంటుంది.
* చలికాలంలో పెదాలు కూడా పొడిబారుతుంటాయి మరియు పగులుతాయి. కాబట్టి లిప్స్టిక్ లు కాకుండా లిప్ బామ్ లను వాడాలి.
*స్నానానికి ముందు మొక్కజొన్న పిండి మరియు పెరుగుతో కలిపి చర్మానికి రాసుకోవాలి ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.