Dil Raju : పవన్, మహేష్ సినిమాలతో బాగా నష్టపోయా.. దిల్ రాజు!

Kaburulu

Kaburulu Desk

December 29, 2022 | 05:29 PM

Dil Raju : పవన్, మహేష్ సినిమాలతో బాగా నష్టపోయా.. దిల్ రాజు!

Dil Raju : టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన కామెంట్స్ చేశాడు. “పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలతో చాలా నష్టపోయా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ ఆ సినిమాలు వల్ల జరిగింది. నేను కాబట్టి తట్టుకున్న ఇంకొకరు అయితే తప్పకుండా ఆత్మహత్య చేసుకునేవారు లేదా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయేవారు” అని వ్యాఖ్యానించాడు.

పవన్ అన్‌స్టాపబుల్‌లో రామ్‌చరణ్‌..

ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవే పవన్ కళ్యాణ్ – అజ్ఞాతవాసి, మహేష్ బాబు – స్పైడర్ చిత్రాలు. అదేంటి ఈ రెండు చిత్రాలకి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాదు కదా అని అంటారా? అవును నిజమే ఈ రెండు సినిమాలని దిల్ రాజు నిర్మించ లేదు కానీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో ఆర్ధికంగా చాలా దెబ్బతిన్నట్లు తెలియజేశాడు.

అయితే ఈ రెండు సినిమాల నష్టం తరువాత దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో వరుసగా 6 చిత్రాలు హిట్టు అవ్వడంతో ఆర్ధికంగా మళ్ళీ నిలదొక్కుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న దిల్ రాజు.. త్వరలోనే ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల్ని కూడా నిర్మించబోతున్నట్లు వెల్లడించాడు.