Garbha : పూరి ఆకాష్ చేతులు మీదుగా ‘గర్భ’ ట్రైలర్ రిలీజ్..

Kaburulu

Kaburulu Desk

December 29, 2022 | 08:18 PM

Garbha : పూరి ఆకాష్ చేతులు మీదుగా ‘గర్భ’ ట్రైలర్ రిలీజ్..

Garbha : ఈ మధ్యకాలంలో కొత్త కథాకథనాలతో వస్తున్న న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ తెలుగు సినీ పరిశ్రమని నెంబర్ వన్ పొజిషన్‌లో పెడుతున్నారు. టాలెంట్ ఉంటే చాలు తమ నైపుణ్యంతో సినిమాని మొబైల్స్‌లో సైతం చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అలా ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ టీం ‘గర్భ’ అనే సినిమాని తెరకెక్కించారు.

Prabhas : ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో ఇవాళే ప్రసారం కానుంది..

గ్రామంలోని కులాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాని ‘సంజీవ్ చిన్నకోట్ల’ డైరెక్ట్ చేశాడు. మొత్తం కొత్త నటులతో, టెక్నీషియన్స్‌తో వస్తున్న ఈ సినిమా నాచురాలిటీకి దగ్గరగా రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. ఇటీవల కాలంలో ఈ తరహాలో వచ్చిన రంగస్థలం, పలాస సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి.

ఇక ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. సినిమా కథ కులవ్యవస్థ గురించి అయినా, సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో కథని నడిపించినట్లు ఉంది ట్రైలర్ చూస్తుంటే. ట్రైలర్ మొత్తాన్ని చాలా ఇంటెన్సిటీతో కట్ చేశారు. సంగీత దర్శకుడు ఘ్యాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. టెక్నీషియన్స్ అంతా కొత్తవారే అయినా మంచి నిర్మాణ విలువలతో సినిమాని తెరకెక్కించారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని వివరాలు తెలియజేయనున్నారు.