Das Ka Dhamki Review : దాస్ కా ధమ్కీ.. కథ, ట్విస్టులు ఊహించొచ్చు.. కానీ మంచి స్క్రీన్ ప్లేతో అదరగొట్టిన విశ్వక్సేన్..

దాస్ కా ధమ్కీ కథ విషయానికి వస్తే హోటల్ లో వెయిటర్ గా పని చేసే హీరో. సమాజంలో బాగా డబ్బున్న ఓ విలన్ కూడా విశ్వక్ సేన్. డ్యూయల్ రోల్. గతంలో కొన్ని సినిమాల్లో హీరో, విలన్ ఒకేలా ఉండటంతో విలన్.............

Kaburulu

Kaburulu Desk

March 23, 2023 | 03:11 PM

Das Ka Dhamki Review : దాస్ కా ధమ్కీ.. కథ, ట్విస్టులు ఊహించొచ్చు.. కానీ మంచి స్క్రీన్ ప్లేతో అదరగొట్టిన విశ్వక్సేన్..

Das Ka Dhamki Review :  విశ్వక్ సేన్, నివేతా పేతురాజ్ జంటగా విశ్వక్ సేన్ సొంత నిర్మాణ, దర్శకత్వంలో వచ్చిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చ్ 22న ఉగాది పండుగ నాడు ఈ సినిమా రిలీజయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రిలీజయిన మొదటి ఆట నుంచే ప్రేక్షకులను మెప్పించింది దాస్ కా ధమ్కీ సినిమా. ఈ సినిమాకి ముందు నుంచి కూడా మంచి అంచనాలు ఉండటంతో పాటు ఎన్టీఆర్ ఈ సినిమాకి సపోర్ట్ ఇవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు, ప్రేక్షకులు రిలీజ్ రోజు బాగానే వచ్చారు సినిమాకు. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో మంచి విజయం సాధించింది దాస్ కా ధమ్కీ.

ఇక దాస్ కా ధమ్కీ కథ విషయానికి వస్తే హోటల్ లో వెయిటర్ గా పని చేసే హీరో. సమాజంలో బాగా డబ్బున్న ఓ విలన్ కూడా విశ్వక్ సేన్. డ్యూయల్ రోల్. గతంలో కొన్ని సినిమాల్లో హీరో, విలన్ ఒకేలా ఉండటంతో విలన్ హీరోని తన ప్లేస్ లో ఇరికించి తాను పారిపోవాలనుకోవడం లాంటివి చూశాం. ఇటీవల వచ్చిన అమిగోస్ సినిమా కథ కూడా ఇదే. కథ అందరికి తెలిసిందే. కాకపోతే ఇందులో కథని ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ తో సరదాగా లవ్, కామెడీ అంశాలతో నడిపించి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ అంతా ట్విస్టులతో నడిపించాడు. విలన్ విశ్వక్ సేన్, అతనికి సంబంధించిన వాళ్ళు మంచోడైన విశ్వక్ ని తన ప్లేస్ ఇరికించి పదివేల కోట్లతో ఎలా ఎస్కెప్ అవ్వాలనుకున్నాడు, వాళ్ళని హీరో ఎలా ఎదుర్కున్నాడు అన్నదే కథ. సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నా కనిపెట్టేయొచ్చు. కథ కూడా పాతదే. కానీ సినిమా నడిపించిన విధానం, స్క్రీన్ ప్లే బాగుండటంతో విశ్వక్ సక్సెస్ అయ్యాడు. తెలిసిన కథని కొత్తగా చూపించి హిట్ కొట్టాడు.

Das Ka Dhamki : రిలీజ్ రోజు విశ్వక్‌సేన్ సినిమా కోసం థియేటర్‌కి వెళ్తే.. రవితేజ సినిమా వేశారు..

సినిమాకి మెయిన్ ప్లస్ విశ్వక్ సేన్. మంచి వాడిగా, నెగిటివ్ షేడ్స్ లో విశ్వక్ పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. విశ్వక్ యాక్టింగ్ లో తన బెస్ట్ ఇచ్చాడు. ఇక డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. ప్రొడ్యూసర్ గా సినిమాకి మంచి రిచ్ లుక్ ఇచ్చాడు. హీరోయిన్ నివేతా పేతురాజ్ ఈ సినిమాలో తన అందాల డోసు బాగానే పెంచింది. మిగిలిన వాళ్ళు కూడా బాగా నటించారు. ఈ సినిమాకి మరో ముఖ్యమైన ప్లస్ మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్. మొత్తానికి విశ్వక్ కష్టపడి హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా సక్సెస్ అయ్యాడని అంటున్నారు ఆడియన్స్. మరి కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి కావడంతో కలెక్షన్స్ లో విశ్వక్ ఏ మేరకు సాధిస్తాడో చూడాలి.