Mukhachitram Trailer : అదిరిపోయే ట్విస్టులతో ముఖచిత్రం ట్రైలర్.. విశ్వక్‌సేన్ స్పెషల్ అప్పీరెన్స్..

Kaburulu

Kaburulu Desk

December 1, 2022 | 05:42 PM

Mukhachitram Trailer : అదిరిపోయే ట్విస్టులతో ముఖచిత్రం ట్రైలర్.. విశ్వక్‌సేన్ స్పెషల్ అప్పీరెన్స్..

Mukhachitram Trailer : వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా రాబోతున్న కొత్త సినిమా ముఖ చిత్రం. ఈ సినిమాకి కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథని అందించగా, కొత్త దర్శకుడు గంగాధర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. తాజగా ముఖచిత్రం సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం.. హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్. ఒక అమ్మాయిని ప్రేమించి అనంతరం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఇద్దరు హీరోయిన్స్ కి ఒకేసారి యాక్సిడెంట్ జరగడంతో ఒకరు చనిపోగా మరొకరు చావు బతుకుల మధ్య ఉంటే ఒకరి ముఖాన్ని తీసి ఇంకొకరికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు హీరో. కథ లైన్ సింపుల్ గా ట్రైలర్ లోనే చూపించినా ముఖం మారాక ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ అమ్మాయి వల్ల హీరోకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి? అసలు మధ్యలో కోర్టు సీన్స్ ఎందుకు ఉన్నాయి? అనే ప్రశ్నలతో ట్రైలర్ ని వదిలేశాడు. దీనిబట్టి ఈ సినిమా ఫుల్ థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో ఉండబోతుందని అర్ధమవుతుంది.

Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన సీనియర్ హీరోయిన్…

మొత్తానికి ముఖ చిత్రం ట్రైలర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. విశ్వక్ సేన్ ఇందులో లాయర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 9న థియేటర్స్ లోకి రానుంది.