Unstoppable 2nd Episode : అన్‌‍స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్

Kaburulu

Kaburulu Desk

October 21, 2022 | 10:11 AM

Unstoppable 2nd Episode : అన్‌‍స్టాపబుల్ షో సెకండ్ ఎపిసోడ్ లో బాలయ్యతో కలిసి రచ్చ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్

Unstoppable 2nd Episode :  బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌‍స్టాపబుల్ షోకి మంచి ఆదరణ లభిస్తుంది. గతవారం అన్‌‍స్టాపబుల్ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ సాధించింది. తాజాగా నేడు అన్‌‍స్టాపబుల్ సీజన్ 2 లో రెండో ఎపిసోడ్ ని విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న యువ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. దీంతో ఈ ఎపిసోడ్ కి యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ కూడా వ్యూస్ బాగా సాధించే దిశగా దూసుకెళ్తుంది.

ఇక ఈ ఎపిసోడ్ లో ఆ హీరోలతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కూడా విచ్చేశారు. వీరి ముగ్గురితో బాలయ్య రచ్చ చేశారు. పలు ఆసక్తికర విషయాలని చర్చించారు. ఈ ఎపిసోడ్ లో మాట్లాడిన అంశాలు ఇవే..

*సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ట్రై చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ బొమ్మరిల్లు సిద్దార్థ్ అనుకోని ఫోన్ చేసి కొన్ని రోజులు ఫోన్స్ లోనే ట్రావెల్ అయ్యారని ఆ సంఘటన గురించి తెలిపాడు.

*సిద్ధూకి కియారా అద్వానీ అంటే క్రష్ అని రెమ్యునరేషన్ లేకుండానే తన పక్కన యాక్ట్ చేయడానికి రెడీ అని చెప్పాడు.

*నాని చేసిన బ్యాండ్ బాజా బారత్ రీమేక్ ఆహా కళ్యాణం సరిగ్గా తీయలేదని, ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు తీయలేదని, ఇంకా బాగా తీసి ఉండాల్సిందని అన్నాడు సిద్ధూ.

*విశ్వక్ సేన్ తన రెండున్నర ఇయర్స్ లవ్ గురించి, రీసెంట్ గా బ్రేకప్ అయిందని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

*హీరోయిన్ అనుపమకి కాల్ చేసి బాలకృష్ణ సరదగా కాసేపు ఆడుకున్నారు. అనుపమ కూడా ఫోన్లో జై బాలయ్య అంటూ హడావిడి చేసింది.

*సిద్ధూ ఓ అబ్బాయికి లిప్ కిస్ ఇచ్చిన ఫోటోని బాలకృష్ణ బయటపెట్టగా దాని గురించి చెప్పాడు.

*విశ్వక్ సేన్ యాంకర్ దేవి నాగవల్లితో జరిగిన గొడవ గురించి మళ్ళీ ఈ షోలో మాట్లాడాడు.

*మొహం మీద ఈ మచ్చలు వేసుకొని హీరో అయిపోదాం అనుకుంటున్నావా అని సిద్ధుని ఎగతాళి చేశారని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

*విశ్వక్ నిర్మాతగా దాస్ కా ధమ్కీ సినిమా తీస్తున్నాను అని, అప్పుడే ప్రొడ్యూసర్స్ షూట్ ఆపేయడంతో చాలా లాస్ అయిందని, ఇల్లు కూడా తాకట్టు పెట్టానని, అదే సమయంలో వాళ్ళ అక్క హాస్పిటల్ పాలైందని చెప్పి ఎమోషనల్ అయ్యాడు.

*12 లక్షలతో తన మొదటి సినిమా తీశానని, దిల్ రాజు గారు ఆ సినిమాని రిలీజ్ చేశారని చెప్పాడు విశ్వక్.

*ఇక నిర్మాత నాగవంశీ రాగా భీమ్లా నాయక్ సినిమాలో ఫస్ట్ బాలకృష్ణని హీరో అనుకున్నామని, బాలాయ్యా వద్దని చెప్పి కళ్యాణ్ గారి పేరుని సూచించారని చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ కి కాల్ చేసి మాట్లాడాడు బాలయ్య బాబు.