Unstoppable : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. యువ హీరోలతో రచ్చ చేసిన బాలయ్య..

Kaburulu

Kaburulu Desk

October 16, 2022 | 09:17 AM

Unstoppable : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. యువ హీరోలతో రచ్చ చేసిన బాలయ్య..

Unstoppable :  బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ 2ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఇటీవలే టెలికాస్ట్ అయింది. మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయ్యాక 24 గంటల్లో ఏకంగా 10 లక్షల మంది చూసి సరికొత్త రికార్డ్ కూడా సృష్టించింది.

ఓ వైపు ఎపిసోడ్ 1 ఇంకా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంటే మరోవైపు ఎపిసోడ్ 2 ప్రోమో రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తాజాగా నేడు అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్ 2 ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లు వచ్చారు. రాగానే బాల్లయ్యతో కలిసి డీజే టిల్లు పాటకి స్టెప్పులు వేసి అలరించారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం సరదాగా సాగింది. యువహీరోలతో బాలయ్య కలిసి రచ్చ రచ్చ చేశారు. కౌంటర్లు, జోకులు, డైలాగ్స్ వేశారు బాలయ్య.

Unstoppable 2 : అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబుతో బాలయ్యబాబు చర్చించిన అంశాలు ఇవే..

ఇక ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. ఇక షోలో త్రివిక్రమ్ కి కాల్ చేసి మాట్లాడారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కలిసి ఈ షోకి వచ్చే సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి సరదాగా ఫ్లర్ట్ చేశారు బాలయ్య. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఫుల్ ఫన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.